పుష్ప-2 ఓటీటీ స్ట్రీమింగ్ పై క్లారిటీ

ఈ సినిమా రిలీజైన రోజు నుంచి 56 రోజుల లోపు ఓటీటీలోకి రాదని క్లారిటీ ఇచ్చింది.

ఫ్లాప్ అయిన సినిమాలు ఎలాగూ 2 వారాల్లో ఓటీటీలోకి వచ్చేస్తాయి. ఈమధ్య హిట్టయిన సినిమాలు కూడా నెల రోజులకు అటుఇటుగా ఓటీటీలో ప్రత్యక్షమౌతున్నాయి. ఇదే వరసలో పుష్ప-2 కూడా మరో 2 వారాల్లో ఓటీటీలోకి వచ్చేస్తుందనే ప్రచారం ఊపందుకుంది.

జనవరి 2 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కు వస్తుందని, కుదరకపోతే జనవరి 9కి సినిమా రావడం గ్యారెంటీ అంటూ కథనాలు మొదలయ్యాయి. సినిమా థియేట్రికల్ రన్ పై ఈ టాక్ కచ్చితంగా ప్రభావం చూపిస్తుంది. అందుకే మేకర్స్ వెంటనే మేల్కొన్నారు.

పుష్ప-2 స్ట్రీమింగ్ పై స్పష్టమైన ప్రకటన చేసింది మైత్రీ మూవీ మేకర్స్. ఈ సినిమా రిలీజైన రోజు నుంచి 56 రోజుల లోపు ఓటీటీలోకి రాదని క్లారిటీ ఇచ్చింది. కాబట్టి, అంతా థియేటర్లకు వచ్చి పుష్ప-2ను ఎంజాయ్ చేయాలని కోరింది.

మేకర్స్ చెప్పిన లెక్క ప్రకారం చూసుకుంటే, జనవరి 29వ తేదీ లోపు పుష్ప-2 సినిమా ఓటీటీలోకి రాదు. ఆ తర్వాత ఏ క్షణానైనా ఈ సినిమా స్ట్రీమింగ్ కు వచ్చేస్తుంది. నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా హక్కుల్ని కొనుగోలు చేసింది.

మరోవైపు ఉత్తరాదిన ఈ సినిమా ప్రభంజనం కొనసాగుతూనే ఉంది. 15 రోజుల్లో రూ.632.50 కోట్ల రూపాయల నెట్ వసూళ్లు సాధించింది. ఇప్పటివరకు ఏ హిందీ సినిమా ఈ ఘనత సాధించలేదు.

One Reply to “పుష్ప-2 ఓటీటీ స్ట్రీమింగ్ పై క్లారిటీ”

Comments are closed.