వైసీపీ అధినేత మరియు మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను ఆస్ట్రేలియాలోని ఎన్నారైలు అత్యంత ఘనంగా నిర్వహించారు.
సిడ్నీ, మెల్బోర్న్, మరియు బ్రిస్బేన్ నగరాలలో జరిగిన ఈ కార్యక్రమాలలో ఆయా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఎన్నారైలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎన్నారైలు మాట్లాడుతూ, రాష్ట్రానికి అనేక మేలు చేసినటువంటి వైఎస్ జగన్ గారి వెంట ఎల్లవేళలా ఉంటామని, ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా ఆయన మార్గాన్ని విడువబోమని పునరుద్ఘాటించారు. అలాగే కూటమి ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గపు చర్యలను, వారి ఆటవిక పోకడలను ప్రజలలోకి విరివిగా తీసుకెళ్తామని తెలిపారు.
ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ నేత లోకేష్‌లను ఉద్దేశించి, వైసీపీ ప్రభుత్వం మళ్ళీ ఏర్పడిన తరువాత వారి అరాచకాలకు తగిన శిక్ష తప్పదని హెచ్చరించారు.
తెలుగుదేశం, జనసేన కార్యకర్తలకు కూడా నైతిక ప్రవర్తనను పాటించాలని, రేపు వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత వారి కోసం ఎవరూ కాపాడలేరని హెచ్చరించారు.
ఈ వేడుకల్లో జూమ్ కాల్ ద్వారా అనుబంధ విభాగాల అధ్యక్షుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మాజీ మంత్రి శ్రీమతి రోజా, శాసనమండలి చైర్మన్ కొయ్య మోషన్ రాజు, మరియు వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అరే శ్యామల గారు ఎన్నారైలతో మాట్లాడారు.
వారు చేస్తున్న ఈ కార్యక్రమాలను కొనియాడుతూ, వైసీపీ నేతలు, ఎన్నారైలు చేసే పోరాటానికి తమ పూర్తి మద్దతును తెలియజేశారు. బృహత్ అంకితభావంతో జగన్ గారి కోసం మద్దతుగా నిలుస్తున్న ఎన్నారైలు అందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.
బ్రిస్బేన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో వైసీపీ ఆస్ట్రేలియా కన్వీనర్ చింతలచెరువు సూర్యనారాయణ రెడ్డి, ఇరువురి బ్రహ్మారెడ్డి, వంశీ చాగంటి, జస్వంత్ రెడ్డి, బొమ్మిరెడ్డి, ఏరువ చిన్నపరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Rasina 6 perullo… 5 toka.. perle.. Malli Nvu mee anna… Kulala.. Gurinchi.. statements
Sigguleni vedavalu, kaneesam amma chelli celebrate cheyyaledu, ee thokalalu anandam yento
Ido comedy
Inka veellaki thaggaledu aithe..
Inka thaggaledu aithe veellaki..
పాల్గొన్న వారు ఒకరు తప్ప అంతా..మయం
yuk
అక్కడ కూడా పిచ్చి వాళ్ళు ఉన్నార