అల్లు అర్జున్ ముందు 20 ప్రశ్నలు

వీటిలో ముఖ్యంగా అనుమతి లేకపోయినా ఎందుకు సంథ్య థియేటర్ కు వెళ్లారు..? మిమ్మల్ని థియేటర్ కు రమ్మని పిలిచింది ఎవరు?

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి విచారణ చేసేందుకు అల్లు అర్జున్ కు చిక్కడపల్లి పోలీసులు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి అల్లు అర్జున్ పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు. ప్రధానంగా 20 ప్రశ్నలను అల్లు అర్జున్ ముందు ఉంచారు పోలీసులు.

వీటిలో ముఖ్యంగా అనుమతి లేకపోయినా ఎందుకు సంథ్య థియేటర్ కు వెళ్లారు..? మిమ్మల్ని థియేటర్ కు రమ్మని పిలిచింది ఎవరు? మీతో పాటు ఉన్న మీ కుటుంబ సభ్యులు, స్నేహితుల పేర్లు ఏంటి? థియేటర్ నుంచి ఎప్పుడు బయటకొచ్చారు? ఎంతమంది బౌన్సర్లను పెట్టుకున్నారు? మీ వ్యక్తిగత బౌన్సర్లు ఎంతమంది, థియేటర్ యాజమాన్యం ఎంతమందిని నియమించింది.. నిర్మాతలు ఎంతమందికి పెట్టారు లాంటి ప్రశ్నల్ని బన్నీ ముందుంచినట్టు తెలుస్తోంది.

వీటన్నింటికంటే ముఖ్యంగా బన్నీకి కొన్ని వీడియోల్ని చూపించబోతున్నారు. ఆ వీడియోలపై అతడి అభిప్రాయాల్ని తీసుకొని రికార్డ్ చేయబోతున్నారు. వీటిలో బన్నీ ఊరేగింపుకు సంబంధించిన వీడియోలే ఎక్కువ. వీటన్నింటినీ కోర్టులో సమర్పిస్తారు.

ఈరోజు బన్నీ చెప్పే సమాధానాలు సంతృప్తికరంగా ఉంటే ఓకే. ఒకవేళ సరైన సమాధానాలు రాకపోతే రేపు మరోసారి బన్నీని విచారణకు పిలిచే అవకాశం ఉంది. అల్లు అర్జున్ వెంట ఆయన మామ, లాయర్ కూడా ఉన్నారు.

మరోవైపు విచారణ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ స్టేషన్ చుట్టుపక్కల ఆంక్షలు విధించారు. మీడియాను కూడా దూరంగా ఉంచడం విశేషం.

8 Replies to “అల్లు అర్జున్ ముందు 20 ప్రశ్నలు”

  1. బన్నీ ని చూడటానికే జనం ఎగబడి వచ్చారని, ఆ తోపులాట కి బన్నీ ఒక్కడే కారణం అంటున్న వాళ్ళకి అక్కడ ఇంకొక రీజన్ కనిపించడం లేదా. ఆ షో కి బన్నీ తో పాటు రష్మిక కూడా వచ్చింది కదా, ఆ వచ్చిన మాస్ అభిమానుల్లో కేవలం రష్మిక ని మాత్రమే చూడటం కోసం ఒక 30% అయినా ఖచ్చితంగా ఉండే ఉంటారు. ఆవిడ గారు రాకపోయినా సిట్యుయేషన్ కొంత కంట్రోల్ లో ఉండేదేమో. ఈ కోణం లో చూస్తే చాలా మంది దోషులుగా మిగిలిపోతారు. ఒక్క బన్నీ నే కార్నర్ చేయడం అనేది సబబు కాదు. ఇప్పటికే మనోవేదన తో తత్త్వం బోధ పడి ఉంటుంది. ఇక ఈ వివాదానికి మంచి ముగింపు రావాలని కోరుకుంటూ…..,.

  2. అల్లు అర్జున్ మే 11 న నంద్యాల వెళ్ళాడు.

    సంధ్య లో ఘటన 11 గంటలకి కి జరిగింది.

    అల్లు అర్జున్ ని A11 గా చేర్చారు..

    మళ్ళీ ఉదయం 11 గం..కి రమ్మని నోటీసులు ఇచ్చారు..

    అర్జున్ వెనక 11 అనే దరిద్రం ఉంది ..

    అది పొతే గాని ఆడు గట్టెక్కడు .

Comments are closed.