కన్నడ ఉక్కు ముద్దు.. విశాఖ ఉక్కు వద్దు

లేటెస్ట్ గా అగ్నిమాపక విభాగాన్ని ప్రైవేట్ పరం చేయడానికి నోటిఫికేషన్ జారీ చేయడం చూస్తే ఆశలు వదులుకోవాల్సిందే అని అంటున్నారు.

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేట్ పరం కాబోతోంది అని అంటున్న నేపథ్యం ఉంది. అలా జరగకుండా కాపాడుతామని చెబుతున్నా ఆ దిశగా అయితే అడుగులు వేగంగా పడుతున్నారు. లేటెస్ట్ గా చూస్తే కనుక విశాఖ స్టీల్ ప్లాంట్ ని పక్కన పెట్టేసినట్లే అంటున్నారు. కేంద్ర ఉక్కు గనుల శఖ మంత్రి కుమారస్వామి బాధ్యతలు స్వీకరించగానే విశాఖ స్టీల్ ప్లాంట్ కి వచ్చి అంతా మొత్తం చూశారు. అధికారులతో మీటింగులు పెట్టారు. ప్లాంట్ ని ప్రైవేట్ పరం కాకుండా కాపాడుతాను అని హామీ ఇచ్చారు.

అయితే ఆయన మాట చెప్పి వెళ్లారు నెలలు గడుస్తున్నాయి కానీ ఉపశమనం కలిగించే విధంగా చర్యలు అయితే తీసుకోవడం లేదు. ఇపుడు మరో వార్త కర్ణాటకలో స్టీల్ ప్లాంట్ కి కేంద్ర ప్రభుత్వం పదిహేను వేల కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటిస్తూ ప్రత్యేక ప్యాకేజీ ని రిలీజ్ చేశారు.

ఉక్కు మంత్రి సొంత రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ సంస్థ విశ్వేశ్వరయ్య అండ్ ఐరన్ అండ్ స్టీల్ లిమిటెడ్ కి కేంద్రం ఈ ప్యాకేజీని ప్రకటించింది. ఈ విషయాన్ని కేంద్ర ఉక్కు మంత్రి కుమార స్వామి స్వయంగా ప్రకటించడం విశేషం. కర్ణాటకలో జేడీఎస్ కి ఇద్దరు ఎంపీల బలం మాత్రమే ఉంది. అయినా కీలకమైన మంత్రిత్వ శాఖను అందుకున్నారు. తన సొంత రాష్ట్రానికి మేలైన నిర్ణయం జరిగేలా చూసుకున్నారు అని అంటున్నారు.

ఏపీలో చూస్తే కేంద్ర ప్రభుత్వాన్ని నిలబెడుతున్న టీడీపీకి 16 మంది ఎంపీలు ఉన్నారు. జనసేనకు ఇద్దరు ఎంపీలు ఉన్నారు. బీజేపీకి ముగ్గురు ఉన్నారు. అయినా కూడా విశాఖ ఉక్కు కోసం ప్రత్యేక ప్యాకేజీని ఎందుకు సాధించలేకపోతున్నారు అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.

కర్ణాటకలోని ఉక్కు కర్మాగారములో పనిచేస్తున్న ఉక్కు కార్మికులు 243 మంది మాత్రమే అంటున్నారు. అదే విశాఖ ఉక్కులో ఇరవై వేల మంది కార్మికులకు ఉద్యోగులు పనిచేస్తున్నారు. అక్కడ 15 వేల ఆర్థిక సాయం ఇస్తే విశాఖ ఉక్కుకు ఎన్ని వేల కోట్లు ఇవ్వాలో చెప్పాలని కూడా ఉక్కు ఉద్యమ కారులు అంటున్నారు.

విశాఖ ఉక్కు లాభాల బాటలో నడవాలీ అంటే 18 వేల కోట్ల రూపాయలు ఇస్తే చాలు అని కోరుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని అంటున్నారు. ఆ దిశగా రాజకీయ ఒత్తిళ్ళు కూడా సరిగ్గా పెట్టలేకపోతున్నారు అని అంటున్నారు. ఏపీకి చెందిన పాతిక మంది లోక్ సభ ఎంపీలు 11 మంది రాజ్యసభ ఎంపీలు కూడా కేంద్రం వద్ద విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ప్రస్తావించి తగిన సాయం తెప్పించడంలో పూర్తిగా విఫలం అవుతున్నారనే అంటున్నారు.

విశాఖ ఉక్కులో ప్రైవేటీకరణ పర్వం మరింత వేంగగా సాగుతోంది. లేటెస్ట్ గా అగ్నిమాపక విభాగాన్ని ప్రైవేట్ పరం చేయడానికి నోటిఫికేషన్ జారీ చేయడం చూస్తే ఆశలు వదులుకోవాల్సిందే అని అంటున్నారు.

24 Replies to “కన్నడ ఉక్కు ముద్దు.. విశాఖ ఉక్కు వద్దు”

  1. సో నీకు కూటమి సాధించిన 65 వేల కోట్ల BPCL పెట్రోలియం రిఫైనరీ కనిపించలేదు

    1. అందుకే చదువుకోమనేది… అది ఇంతకుముందు జగన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు జరిగిన ఒప్పందం ఇప్పుడు realise అవుతుంది.. టోటల్ ప్రాజెక్ట్ 60 వేల కోట్లు అయినా.. ప్రస్తుతం 6 వేల కోట్లకు ఒప్పుకున్నారు..

      అమరావతి కి ఇచ్చింది గ్రాంట్ కాదు.. అప్పు.. నారాయణే చెప్పాడు ఆ మాట

      పోలవరం కి చేసింది ఏముంది ? 48 వేల కోట్లకి ఒప్పుకున్నారా. ? లేదు.. మరేం సాధించారు.. ?

      1. ఓరి నిషాని….అంది రాష్ట్ర విభజన సమయం లో ఇచ్చిన హామీ…గత అయిదు ఏళ్ళు ఫాలో అప్ చెయ్యలేడు మన మెడలు వంచుతా అని కాళ్లు మొక్కిన వెధవ. అందరు మన అన్న మాద్రిని తెలివి తక్కువ వెధవలు ఉండరుగా ప్రాజెక్ట్ డబ్బులు అన్నీ ఒకేసారి పెట్టడానికి.ఎథినా భారీ ప్రాజెక్ట్ విధాతల వారీగా పనులు దానికి తగ్గట్టు డబ్బులు పెడతారు అని కూడా తెలిసిసావాడు

          1. చదువు ఎడ్వాల్సింది తమరి…మొదటి అయిదు ఏళ్ళలో కేంద్రం నుండి పలు విద్యా మరియు ఇతర సంస్థలు వచ్చాయి…తెలిసి ఎడ్వాదుకదా మనకి. ఇతర సంస్థలు, ప్రత్యేక హోదా కోసమే 2018 ప్రభుత్వం నుండి బయటకు వచ్చి పోరాటం చేసింది, మన మాదిరి కాసుల కోసం తప్ప రాష్ట్ర ప్రయోజనాలు పట్టింపు లేకుండా సంకనాకించలేదు

      2. ఓహో ఇచ్చిన కేంద్ర మునుండి పాపం నిర్మలా సీతారామన్ పిచ్చిది మరి. అమరావతి తిరిగి కట్టే బాధ్యత మాది అని చెప్పింది

      3. 2022 లో డిఆఫ్రొమ్ వాల్ మునిగితే అప్పటినుండి అతీగతీ లేదు…ఇప్పుడు కొత్తదానికి ఆమోదం. పనులు మొదలయ్యాయి…బేసిక్స్ తెలిసి ఎడ్వాడు కామెంట్స్ చేస్తున్నావ్

  2. మావోడికి మందలు మందలు 30 ఎంపీ లు ఉన్నప్పుడు.. మనది ప్రత్యేక జన్మజన్మల బంధం అంటూ మోడీ ని పొగిడి.. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ని తొలగించేయ్.. నేను ఆ జాగాలో 11 ప్యాలెస్ లు కట్టుకుంటా అని అడిగాడు కదా?? మరి దాని గురించి మర్చిపోతే ఎలా గ్యాసు??

  3. అప్పుడెవడో…ఎలక్షన్ కి ముందు జగన్ కి 22 మంది ఎంపీ లు ఉన్నా ఎం పీకలేదు.. నాకు ఒక్క ఎంపీ ఇవ్వండి.. అడ్డంగా పడుకొని మరీ ఆపేస్తే అన్నాడు.. ఇప్పుడు ఇద్దరు ఉన్నారు… ఎం పీకుతున్నాడో….

    జగన్ ఉన్నప్పుడు, స్టీల్ ప్లాన్ సేల్ కి సంబంధించి ఎటువంటి ఆక్టివిటీస్ జరగలేదు… మొత్తాన్ని హోల్డ్ చేసాడు.. కనీసం బీజేపీ తో రిలేషన్ లో లేకపోయినా.

    1. హోల్డ్ చేశాడా.?..పాపం స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు తెలియకా పాపం ఏడాది పైగా నిరసనలు అని, నిరాహారదీక్షలు అని చేశారు

  4. తమిళ కన్నడ ఒరిస్సా ఇ ప్రాంతాలనుండికేంద్ర మంత్రి వర్గం లో ఎవ్వరైనా ap న్యాయం చేస్తారు ఎలా నమ్మేరురా..

  5. ap చుట్టూ ఉన్న ప్రాంతాలనుండికేంద్ర మంత్రి వర్గం లో ఎవ్వరైనా ap న్యాయం చేస్తారు ఎలా నమ్మేరురా..

  6. ap కి ap నుండి కేంద్రానికి వెల్లినోళ్లే న్యాయం చేయడం లేదు…పక్కోళ్ళు ఎలాక్కుబిస్తారు అని నమ్మేరా..

Comments are closed.