ఫ్యాన్స్ ను పలకరించడమే కష్టమవుతుంది!

ఫ్యాన్స్ కారణంగా ఇలా ఇబ్బందులు ఎదురవుతూ వుంటే హీరోలు ఇక నిర్లిప్తంగా మారిపోయే ప్రమాదం వుంది.

రాను రాను హీరోలు సాఫ్ట్ టార్గెట్ లు గా మారుతున్నట్లు కనిపిస్తోంది. ఫ్యాన్స్ చెప్పారనో, ఫ్యాన్స్ కష్టంలో వున్నారనో ఫోన్ లోనో, పర్సనల్ గానో పలకరించి, తాను వున్నా, చూసుకుంటా అని చెప్పడమే పాపంగా మారిపోయే పరిస్థితి కనిపిస్తోంది. ఆ మాట పట్టుకుని, మాట ఇచ్చారు కానీ ఏమీ చేయలేదు అని యాగీ చేయడం మొదలుపెడితే, దాన్ని పట్టుకుని మీడియా కథనాలు వండడం ప్రారంభిస్తే ఇక పరిస్థితి ఎక్కడికో వెళ్లిపోతుంది.

దేవర సినిమా ముందు ఎన్టీఆర్ ఓ అభిమానిని ఫోన్ లో పలకరించి భరోసా ఇచ్చారు. ఎన్టీఆర్ మాట మేరకు ఫ్యాన్స్ అంతా కలిసి దాదాపు పది నుంచి పన్నెండు లక్షలు సేకరించి, అందించారు. అదే పేషెంట్ కు తిరుమల తిరుపతి దేవస్థానం దాదాపు 40 లక్షలు, ఆరోగ్యశ్రీ వల్ల దాదాపు 10 లక్షలు సమకూరాయి. కానీ ఇంకా ఎన్టీఆర్ సాయం చేయలేదు అనడంతో మొత్తం మీడియా అటెంన్షన్ అటు తిరిగింది. దాంతో ఎన్టీఆర్ తరపున అభిమానులు వెళ్లి వ్యవహారం ఏమిటో కనుక్కోవాల్సి వచ్చింది.

తెలిసింది ఏమిటంటే కొంత మేరకు పాత అప్పులు తీర్చుకున్నట్లు, కొంత మేరకు ఇంకా మిగులు వున్నట్లు, కానీ సకాలంలో ఆసుపత్రి బిల్లులు కట్టి, పేషెంట్ ను బయటకు తీసుకురాకపోవడంతో, మొత్తం బిల్లు 77 లక్షలకు కాస్త అటు ఇటుగా చేరిపోయినట్లు తెలుస్తోంది. దీంతో ఎన్టీఆర్ తరపున వెళ్లి, ఆసుపత్రి వర్గాలతో మాట్లాడి, కొంత మొత్తం కట్టి సెటిల్ చేసి, మందులు, వీల్ చైర్ కొని ఇచ్చి పేషెంట్ ను ఇంటికి పంపించారు.

ఈ మొత్తం ఉదంతంలో ఎన్టీఆర్ అభిమానులు ఇచ్చింది కాకుండా ఎన్టీఆర్ డబ్బు ఓ తొమ్మిది నుంచి పది లక్షల వరకు ఖర్చయినట్లు తెలుస్తోంది.

ఇక్కడ డబ్బు ఖర్చు అన్నది పాయింట్ కాదు. ఫ్యాన్స్ కారణంగా ఇలా ఇబ్బందులు ఎదురవుతూ వుంటే హీరోలు ఇక నిర్లిప్తంగా మారిపోయే ప్రమాదం వుంది. అప్పుడు అవసరమైన వాళ్లకు సహాయం అందడం కష్టం అవుతుంది.

5 Replies to “ఫ్యాన్స్ ను పలకరించడమే కష్టమవుతుంది!”

  1. ఇతని విషయంలో ఎన్టీఆర్ నే ఎందుకు స్పందించాలి. సహాయం చేయాలి. గవర్నమెంట్ ఎందుకు చేయకూడదు.

    సీఎం సహాయనిధి నుంచి ఎందుకు ఇవ్వకూడదు.

  2. ఎవ్వడు సాయం చేయమన్నాడుని బకారాగాళ్ళకి..వాళ్ళకి దూరడెక్కువై సంఘాలుంపెట్టుకుంటారు..తీరిపోయాక ఏడుస్తారు… బీన్ పాలనని చూసి నెర్స్హుకోవాలి సినిమా వర్గాలు

Comments are closed.