కూటమిలో చిచ్చు తప్పదా?

ఆడారి చేరిక కూటమి పార్టీల మధ్య రాజకీయ రచ్చ రగిలిస్తుందా అన్నది కూడా ఆసక్తికరంగా మారింది.

వైసీపీ నేతలను కూటమిలోకి చేర్చుకోవద్దు అని కొద్ది రోజుల క్రితం స్పీకర్ అయ్యన్నపాత్రుడు కోరారు. టీడీపీ- జనసేన- బీజేపీలకు ఆయన ఈ విధంగా విజ్ఞప్తి చేశారు. అయిదేళ్ల పాటు వైసీపీ నేతలు పెట్టిన బాధలకు కూటమి పార్టీలకు చెందిన కార్యకర్తలు అంతా నానా అవస్థలు పడ్డారని కూడా ఆయన చెప్పారు.

కూటమిలోని పార్టీల నేతలు కార్యకర్తలకే మేలు జరిగేలా చూడాలని అయిదేళ్ల పాటు అంతా కలసి ప్రశాంతంగా పాలించుకుందామని ఆయన పిలుపు ఇచ్చారు. అయ్యన్నపాత్రుడు ఇచ్చిన పిలుపు విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి ఆనంద్ కుమార్ ని చేర్చుకోవద్దు అన్న ఉద్దేశ్యంతోనే అంటున్నారు.

టీడీపీ నేతల వ్యతిరేకత మధ్యనే ఆడారి కుటుంబానికి పసుపు పార్టీలో చేరే అవకాశం లేకుండా పోయింది అని అంటున్నారు. జనసేన కార్పోరేటర్ విశాఖ డెయిరీలో అవకతవకల మీద పోరాటం చేస్తున్నారు అందువల్ల ఆ పార్టీ కూడా చేర్చుకోలేదని అంటున్నారు.

అయితే రాజకీయంగా ఎదగాలని చూస్తున్న బీజేపీ మాత్రం ఆడారి కుటుంబాన్ని అక్కున చేర్చుకుంది. ఆడారి ఆనంద్ కుమార్ తో పాటు ఆయన సోదరి ఎలమంచిలి మున్సిపల్ చైర్ పర్సన్ ని ఇతర నాయకులను కమలం పార్టీ కండువాలు కప్పి కూటమిలోకి ఆహ్వానించింది. దీని వెనక బీజేపీ కీలక నేతలు చక్రం తిప్పారని అంటున్నారు. అంగబలం అర్ధబలం ఉన్న ఆడారిని తమ వైపు తిప్పుకుంటే విశాఖ జిల్లాలో బలపడతామని బీజేపీ భావిస్తోంది.

అయితే ముందే చెప్పినట్లుగా అయ్యన్నపాత్రుడు దీని మీద కీలకమైన సూచన చేశారు. కానీ బీజేపీ పట్టించుకోలేదు. ఇటీవల ముగిసిన అసెంబ్లీ సమావేశాలలో చివరి రోజున విశాఖ డెయిరీ అవకతవకల మీద విచారణ కోసం సభా సంఘాన్ని కూడా నియమిస్తూ స్పీకర్ హోదాలో అయ్యన్నపాత్రుడు ప్రకటించారు.

ఇప్పుడు ఆడారి కుటుంబం బీజేపీలో చేరింది. అలా కూటమిలో కూడా చేరిపోయినట్లు అయింది. దాంతో విశాఖ డెయిరీ మీద ఏ రకంగా చర్యలు తీసుకుంటారు అన్నది కూడా తర్కించుకుంటున్నారు. అయ్యన్నపాత్రుడు అయితే వద్దు అని చెప్పినా తీసుకున్నారని దాంతో ఆయన ఈ చేరికల మీద ఏ విధంగా స్పందిస్తారో చూడాలని అంటున్నారు. ఆడారి చేరిక కూటమి పార్టీల మధ్య రాజకీయ రచ్చ రగిలిస్తుందా అన్నది కూడా ఆసక్తికరంగా మారింది.

7 Replies to “కూటమిలో చిచ్చు తప్పదా?”

  1. ఈ మాత్రం దానికె చిచ్చా? పాపం, చివరికి సింగిల్ సింగం చిచ్చు మీదె ఆసలు పెట్టుకుందా?

  2. విలువలు లేని great Andhra last five years ఎన్ని ఆపద్ద పు రాతలు రాసావో అందరికి తెలుసు ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసావా మిమల్ని ఎవరూ నమ్మరు టైం వేస్ట్

Comments are closed.