శ్రీముఖి క్షమాపణలు.. దిల్ రాజు సంగతేంటి?

విషయం వివాదాస్పదమవ్వడంతో శ్రీముఖి భేషరతుగా క్షమాపణలు చెప్పింది.

గడిచిన 24 గంటలుగా శ్రీముఖిపై సోషల్ మీడియాలో ఒకటే ట్రోలింగ్. నిజానికి ఆమెకు ట్రోలింగ్ కొత్త కాదు. గతంలో ఆమెపై బాడీ షేమింగ్ కామెంట్స్ కూడా పడ్డాయి. అయితే ఈసారి విషయం పూర్తిగా భిన్నం.

ఓ రాంగ్ స్టేట్ మెంట్ ఇచ్చి అడ్డంగా దొరికిపోయింది శ్రీముఖి. అందుకే ఆమెను సోషల్ మీడియాలో తిట్టిపోస్తున్నారు జనం. దీంతో క్షమాపణలు చెప్పక తప్పలేదు.

“సంక్రాంతికి వస్తున్నాం” సినిమా ఫంక్షన్ కు యాంకరింగ్ చేసింది శ్రీముఖి. దిల్ రాజు, శిరీష్ ను పొగిడే క్రమంలో కాస్త ఎక్సయిట్ అయింది. “రామలక్ష్మణులు ఫిక్షనల్ పాత్రలు. మనం అప్పట్లోనే విన్నాం. కానీ సాక్షాత్తూ నా కళ్ల ముందు రామలక్ష్మణులు కూర్చున్నారు. ఒకరు దిల్ రాజు అయితే, మరొకరు శిరీష్.” అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.

దీంతో శ్రీముఖిని హైందవులు తెగ తిడుతున్నారు. “చూడకపోతే ఫిక్షనల్ క్యారెక్టర్స్ అయిపోతారా.. నీ ముత్తాతను నువ్వు చూడలేదు కాబట్టి ఆయన ఫిక్షనల్ క్యారెక్టరా” అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు.

విషయం వివాదాస్పదమవ్వడంతో శ్రీముఖి భేషరతుగా క్షమాపణలు చెప్పింది. “రామలక్ష్మణుల్ని పొరపాటున ఫిక్షనల్ అన్నాను, నేనూ హిందువునే. ఇలాంటి పొరపాట్లు ఇకపై జరగకుండా జాగ్రత్త పడతాను. అందర్నీ క్షమాపణలు కోరుకుంటున్నాను. జై శ్రీరామ్.” అంటూ వీడియో రిలీజ్ చేసింది.

దిల్ రాజుపై కూడా ట్రోలింగ్..

ఇదే ఈవెంట్ కు సంబంధించి దిల్ రాజుపై కూడా కొంతమంది తెలంగాణ వాసులు విమర్శలు చేస్తున్నారు. ఈవెంట్ లో ప్రేక్షకుల నుంచి పెద్దగా ఈలలు, చప్పట్లు, గోల లేకపోవడంతో.. అది చూసిన దిల్ రాజు కొన్ని కామెంట్స్ చేశారు.

“ఆంధ్రాలో సినిమాకు ఓ వైబ్ ఇస్తారు. మన దగ్గర (తెలంగాణలో) కల్లు, మటన్ కు వైబ్ ఇస్తాం.” అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చలికాలం చెట్లలోకి పోయి కల్లు తాగుదాం అంటూ ఉత్సాహం తీసుకొచ్చే ప్రయత్నం చేశారు.

అయితే దిల్ రాజు వ్యాఖ్యల్ని కొంతమంది తప్పుబడుతున్నారు. తెలంగాణ అంటే కల్లు, మటన్ మాత్రమే కాదని, అదే ప్రాంతానికి చెందిన దిల్ రాజు అలా మాట్లాడ్డం కరెక్ట్ కాదని అంటున్నారు.

10 Replies to “శ్రీముఖి క్షమాపణలు.. దిల్ రాజు సంగతేంటి?”

  1. ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు… కాల్ బాయ్ వర్క్

  2. తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు… కాల్ బాయ్ వర్క్

  3. తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు… సీ బి వర్క్

Comments are closed.