కోట్ల మంది స్నానాలు చేస్తున్నారు.. అంటూ గొప్పలు చెప్పుకోవడం కాదు కానీ, పోతున్న ప్రాణాలకు జవాబుదారీ అనే మాటకు మాత్రం సమాధానం లేదు! ఈ పర్యాయం మహాకుంభమేలాలో స్నానాల ఘాట్ సమీపంలో జరిగిన ఒక తొక్కిసలాట ఘటన మరకవముందే.. కుంభమేలా ప్రయాణికుల రద్దీతో ఢిల్లీ రైల్వే స్టేషన్ లో మరో దర్ఘటన చోటు చేసుకుంది!
ఇవన్నీ వరసగా చూశాకా.. ఇంకా ఎన్ని రోజుల పాటు ఈ కుంభమేలా? అని సగటు మనిషి గూగుల్ ను ప్రశ్నించాల్సి వస్తోంది! ఒక పద్దతీ పాడు లేకుండా.. అటు ప్రభుత్వాలు, ఇటు ప్రజలు ఒక క్రమశిక్షణ లేకుండా ఇలాంటి పరిస్థితులకు కారణం అవుతున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు!
రైల్వే స్టేషన్ దుర్ఘటననే తీసుకుంటే.. ప్రయాణించాల్సిన రైలు లేట్ కావడంతో.. అది స్టార్ట్ అయ్యేంత వరకూ టికెట్లను ఇస్తూనే ఉన్నారట! అయినా.. ఒక రైలుకు ఎన్ని టికెట్ లను జారీ చేయాలనే పద్ధతి ఇండియాలో ఉందని అనుకుంటున్నారా అదెప్పుడూ కనపడదు ఆచరణలో! ఉదాహరణకు హైదరాబాద్ నుంచి ఒక రైలు బెంగళూరుకు వెళ్తుందని అనుకుందాం. అందులో రిజర్వేషన్ బోగీలకు పక్కా లెక్క ఉంటుంది. ఆన్ లైన్ బుకింగ్ , ఆఫ్ లైన్ బుకింగ్ ఎలా అయినా ఉన్న సీట్లకూ జారీ చేసే టికెట్లకూ పొంతన ఉంటుంది. ఎటొచ్చీ జనరల్ బోగీలు అంటే.. మాత్రం అలాంటి లెక్కలు ఉండవు.
సీట్ల లెక్కన చూస్తే ఒక్కో బోగీలో ప్రయాణించగల గరిష్ట ప్రయాణికుల సంఖ్య 90. ఒక ఎక్స్ ప్రెస్ రైలుకు నాలుగు జనరల్ బోగీలు ఉంటాయనుకుంటే.. రైలు స్టార్ట్ అయ్యే స్టేషన్ లో అయినా ఆ మేరకు 360 టికెట్లకు మించి అమ్మకూడదు! అయితే.. ఈ నియమాన్ని ఎప్పుడూ పాటించిన పరిస్థితి కనపడదు. ఎంతమంది వస్తే అంతమందికీ జనరల్ టికెట్లను ఇస్తూనే ఉంటారు! దీంతో.. జనరల్ బోగీల్లో విపరీతమైన రద్దీ ఏర్పడుతుంది. 90 మంది ప్రయాణించాల్సిన బోగీలో కనీసం మూడు వందల మంది, నాలుగు వందల మంది కూడా ప్రయాణించడానికి తగినట్టుగా టికెట్లను ఇస్తూనే ఉంటారు! స్టార్ట్ అయ్యే ప్రధాన స్టేషన్లలోనే ఇలాంటి పరిస్థితి ఉంటుంది. ఇక మార్గమధ్యంలో జారీ అయ్యే టికెట్లు, ఎక్కే ప్రయాణికుల లెక్క వేరే!
ఢిల్లీ స్టేషన్ దుర్ఘటనకు కూడా పరోక్షంగా ఈ కారణమూ కనిపిస్తోందనే విమర్శ వస్తోంది. బయల్దేరాల్సిన ట్రైన్ నాలుగైదు గంటలు లేట్ కావడంతో, ఆ నాలుగు గంటల పాటు స్టేషన్ కు చేరుకునే వాళ్లందరూ అదే ట్రైన్ లక్ష్యంగా టికెట్లను కొనుక్కొన్నారు. కుంభమేళా నేపథ్యంలో నాలుగు గంటల పాటు అదనంగా టికెట్ల అమ్మకం కొనసాగిందంటే.. ఎంతమంది పోగయి ఉంటారో ఊహించుకోవడం కష్టం కాదు. ఫలితం.. దారుణం!
మరి దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు అంటే.. మహా అంటే ఎక్స్ గ్రేషియా! సంతాపం, విచారం! ఇలాంటి దుర్ఘటనలు అయినా విప్లవాత్మక మార్పులకు ఏమైనా ఆస్కారం ఇస్తాయా అంటే అలా ఆశించడం కూడా అత్యాశగా మారింది దేశంలో! ఫిబ్రవరి 26 వరకూ సాగుతుందట కుంభమేలా! కనీసం జరిగిన దుర్ఘటనలను దృష్టిలో ఉంచుకుని అయినా భక్తగణం కాస్త క్రమశిక్షణతో సాగితే అదే అసలైన పుణ్యఫలంలాగుంది.
bullet train vastundi appudu anni set aithai. jai modi bhai. antha varaku voorla barrelu vunnayi station lo janamu vunnaru. rentiki ippudu teda aithe telvatam ledu. kotha varaku ave better tokkesukovu oka daniki okati sahayam chesukuntayi. manollu inkaa waraast. chinna pillalni tokkeyadam ento.
కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,
Evodhu