రాబిన్ హుడ్ ట్రంప్ కార్డ్ ‘కేతిక’

చంద్రబోస్ కు ఐటమ్ సాంగ్ ల్లో ఓ స్టయిల్ వుంది. సుకుమార్ సినిమాల్లో అని కనిపిస్తుంది. ఓ కాన్సెప్ట్ తీసుకుని దానికి అనుగుణంగా రాసుకుంటూ వెళ్లడం.

స్లో అండ్ స్టడీ విన్స్ ది రేస్ అన్న టైపులో ముందుకు వెళ్తోంది రాబిన్ హుడ్ టీమ్. కొన్ని వారాల క్రితం వరకు డెడ్ హార్స్ లా కనిపించింది. తరువాత తరువాత మెల్లగా కదలడం మొదలయింది. వన్ బై వన్ కంటెంట్ వస్తోంది కానీ పెద్దగా కిక్ వస్తోందా లేదా అని డౌట్. టీమ్ కొత్త పంథాలో పబ్లిసిటీ స్టార్ట్ చేసింది.. కాస్త ఊపు రావడం ప్రారంభమైంది. ఇలాంటి టైమ్ లో ఒక ట్రంప్ కార్డ్ ను విసిరింది. అదే..’అదిదా సర్పయిజ్’. కేతిక శర్మ చేసిన స్పెషల్ లేదా ఐటమ్ సాంగ్. ఈ పాట ఇప్పుడు సర్రున కుర్రాళ్లలోకి దూసుకుపోయింది. ఇలా విడుదల చేస్తే అలా నాలుగు మిలయన్ల వ్యూస్ ను సాధించేసింది.

చంద్రబోస్ కు ఐటమ్ సాంగ్ ల్లో ఓ స్టయిల్ వుంది. సుకుమార్ సినిమాల్లో అని కనిపిస్తుంది. ఓ కాన్సెప్ట్ తీసుకుని దానికి అనుగుణంగా రాసుకుంటూ వెళ్లడం. పుష్ప వన్ లో ‘ఊ అంటావా మావా’.. పుష్ప 2 లో ‘దెబ్బలు పడతాయ్ రో’. ఈ వరుసలో ఇప్పుడు ‘అదిదా సర్ప్రయజ్’. ఆ విధంగా చంద్ర‌బోస్ ఓ ప్లస్ పాయింట్.

ఎవరు ఏమనుకున్నా, శేఖర్ మాస్టర్ కంపోజింగ్ వేరే. ఎంత తిట్టుకున్నా, డాకూ మహరాజ్ లో ఐటమ్ సాంగ్ విపరీతంగా వైరల్ అయిపోయింది. ఇప్పుడు ఈ రాబిన్ హుడ్ సాంగ్ కు కూడా క్రేజీ మూవ్ మెంట్స్ కంపోజ్ చేసాడు. ఇప్పుడు ఆ మూవ్ మెంట్స్ అన్నీ వైరల్ రీల్స్ గా మారిపోతున్నాయి. వాటికి మీమ్స్ తోడవుతున్నాయి.

ఇక మూడో ఫ్యాక్టర్ కేతిక శర్మ. పాటకు శేఖర్ మాస్టర్ ఇచ్చిన భంగమలను మరింత ఇంప్రూవ్ చేసి మెలికలు తిరిగేసింది. ఆ మూవ్ మెంట్స్ అన్నీ ఇప్పుడు వైరల్ అవుతూ రాబిన్ హుడ్ ను ఓ పొజిషన్ కు చేర్చాయి.

పాట సంగతి ఇలా వుంటే నిన్న జరిగిన మీడియా మీట్ లో హీరో నితిన్, దర్శకుడు వెంకీ కుడుముల, నటుడు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడిన మాటలు సినిమా మీద నమ్మకాన్ని పెంచాయి.

మొత్తం మీద రాబిన్ హుడ్ ఇప్పుడు తను కూడా సరైన పోటీనే అని ముందుకు వచ్చేసింది. అదే రోజు మ్యాడ్ 2 తో సహా ఏడు సినిమాలు విడుదల అవుతున్నాయి. ఏ సినిమా అదృష్టం ఎలా వుందో..వెయిట్ అండ్ సీ.

4 Replies to “రాబిన్ హుడ్ ట్రంప్ కార్డ్ ‘కేతిక’”

Comments are closed.