అల్లు అర్జున్ తదుపరి చిత్రంపై అందరి చూపు ఉంది. దీనికి సంబంధించి చాలా కథనాలు కూడా వస్తున్నాయి. ముందుగా అట్లీ సినిమా స్టార్ట్ చేస్తాడని, ఆ తర్వాత కొన్నిరోజులకు త్రివిక్రమ్ సినిమా మొదలుపెడతాడనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
అయితే ఇప్పుడీ కథనాలతో సమాంతరంగా మరో చర్చ కూడా మొదలైంది. వీటిలో ఒక ప్రాజెక్టును దిల్ రాజు నిర్మిస్తారనేది ఆ చర్చల సారాంశం.
లెక్కప్రకారం బన్నీ-అట్లీ సినిమాను సన్ పిక్చర్స్ ప్రొడ్యూస్ చేయాలి. కానీ ఈ ప్రాజెక్ట్ నుంచి సదరు సంస్థ తప్పుకున్నట్టు, అందులోకి దిల్ రాజు ఎంటర్ అయినట్టు వార్తలొస్తున్నాయి.
ఇవి నిజమా కాదా అనే విషయాన్ని పక్కనపెడితే, ఇప్పుడున్న పరిస్థితుల్లో దిల్ రాజు అంత ధైర్యం చేస్తారా అనేది ఆసక్తికరమైన అంశం. మొన్ననే గేమ్ చేంజర్ సినిమాతో దిల్ రాజుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.
తను ఆ సినిమా ఫలితాన్ని ఇప్పటికిప్పుడు విశ్లేషించనని, ఏడాది చివర్లో బ్యాలెన్స్ షీట్ చూసుకుంటానని ఆయన పైకి చెబుతున్నప్పటికీ, ఆర్థికంగా అతడ్ని చాలా ఇబ్బందిపెట్టింది గేమ్ ఛేంజర్.
పైగా ఇకపై కంటెంట్ ఉన్న సినిమాలు మాత్రమే చేస్తానని, మారిన దిల్ రాజును చూస్తారంటూ ఆయన పదేపదే చెప్పుకొచ్చారు. భారీ బడ్జెట్ సినిమాలకు ఆయన దూరమయ్యారని దీనర్థం. పైగా ఎఫ్డీసీ ఛైర్మన్ గా ఆయనపై అదనపు బాధ్యతలున్నాయి.
సో.. ఇలాంటి టైమ్ లో మరో భారీ బడ్జెట్ సినిమాను భుజానికెత్తుకునే సాహసం దిల్ రాజు చేయకపోవచ్చు. నిజంగా ఆయనా పని చేయాలనుకుంటే ఈపాటికే ప్రభాస్ సినిమాను ఆయన తెరపైకి తీసుకొచ్చి ఉండేవారు.
May be