‘ఆంధ్ర‌జ్యోతి’పై బాబుకు ఐఏఎస్‌ల ఫిర్యాదు

త‌మ కుటుంబ ప‌రువు ప్ర‌తిష్ట‌ల‌ను భంగ‌ప‌రిచేలా, మ‌హిళ‌ల‌ను తెరపైకి తీసుకొచ్చి, త‌ప్పుడు క‌థ‌నాలు రాశారంటూ చంద్ర‌బాబుకు ఫిర్యాదు చేసిన‌ట్టు తెలిసింది.

ఆంధ్ర‌జ్యోతి ప‌త్రిక‌లో త‌మ‌ను కించ‌ప‌రిచేలా క‌థ‌నం రాశారంటూ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడికి ఐఏఎస్‌లు ఫిర్యాదు చేసిన‌ట్టు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. ఈ నెల 11న మేడ‌మ్ సార్‌…మేడ‌మ్ అంతే! అనే శీర్షిక‌తో ఆంధ్ర‌జ్యోతిలో సీనియ‌ర్ ఐఏఎస్ అధికారుల భార్యల‌ దందాపై రాసిన‌ ప్ర‌త్యేక క‌థ‌నం చంద్ర‌బాబు పాల‌న‌ను ప్ర‌తిబింబించింద‌నే విమ‌ర్శ వెల్లువెత్తింది. స్టార్ హోట‌ళ్ల‌లో సీనియ‌ర్ ఐఏఎస్‌ల భార్య‌లు తిష్ట వేసి, అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డ‌గోలు వ్య‌వ‌హారాల‌కు తెగ‌బ‌డ్డార‌నేది ఆ క‌థ‌నం సారాంశం.

ఈ క‌థ‌నంపై సీనియ‌ర్ ఐఏఎస్ అధికారులు సీరియ‌స్ అయ్యార‌ని స‌మాచారం. త‌మ కుటుంబ ప‌రువు ప్ర‌తిష్ట‌ల‌ను భంగ‌ప‌రిచేలా, మ‌హిళ‌ల‌ను తెరపైకి తీసుకొచ్చి, త‌ప్పుడు క‌థ‌నాలు రాశారంటూ చంద్ర‌బాబుకు ఫిర్యాదు చేసిన‌ట్టు తెలిసింది. ఇటీవ‌ల కాలంలో ఐఏఎస్ అధికారుల అవినీతిపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. దీంతో అత్యున్న‌త స‌ర్వీసులంటేనే ప్ర‌జ‌ల్లో చుల‌క‌న భావ‌న ఏర్ప‌డింది.

ఈ నేప‌థ్యంలో గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా సీనియ‌ర్ ఐఏఎస్‌ల భార్య‌లే స్టార్ హోట‌ళ్ల‌లో దుకాణాలు తెర‌వ‌డం ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్రజానీకాన్ని నివ్వెరప‌రిచింది. ఈ క‌థ‌నంతో సీనియ‌ర్ ఐఏఎస్ అధికారులు భుజాలు త‌డుముకునే ప‌రిస్థితి. ఇలాంటి క‌థ‌నాల‌తో ప్ర‌జ‌లు ఛీత్క‌రించుకుంటార‌ని, క‌థ‌నం రాసిన ప‌త్రిక‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సీఎం చంద్ర‌బాబును కోరిన‌ట్టు తెలిసింది.

అయితే చంద్ర‌బాబుకు అనుకూల ప‌త్రిక కావ‌డం, మ‌రోవైపు ఐఏఎస్‌లే స‌ర్వ‌స్వం అని ఆయ‌న భావిస్తుండ‌డంతో ఎటూ తేల్చుకోలేని ప‌రిస్థితి. ఇదే క‌థ‌నాన్ని జ‌గ‌న్ పత్రిక రాసి వుంటే, ఈ పాటికి కేసులు, ఐఏఎస్ అధికారుల సంఘం మీడియా స‌మావేశం పెట్టి ఖండించ‌డాలు వుండేవి. కానీ ప్ర‌భుత్వ అనుకూల ప‌త్రిక‌న్న ముద్ర వుండ‌డంతో అంతా గ‌ప్‌చుప్‌.

8 Replies to “‘ఆంధ్ర‌జ్యోతి’పై బాబుకు ఐఏఎస్‌ల ఫిర్యాదు”

  1. ఇక్కడ నీ భాద ఏమిటి,

    కొంతమంది అధికారుల లోపాల గురించి ఆంధ్రజ్యోతి రాసింది అనా?

    అనుకూల ప్రభుత్వం అయిన కూడా, దమ్ము తో ఒక న్యూస్ పేపర్ చేయాల్సిన పని తాను చేసింది అనా ?

    ఇలాంటి పనులు , అప్పట్లో సాక్షి చేస్తే , కనీసం ప్రతిపక్ష పదవి అయిన వుండేది.

  2. ఆ పత్రిక రాసిన దాంట్లో నిజం లేకపోతే “అయ్యా ఎస్” లు డైరెక్ట్ గా కోర్ట్ కి వెళ్లొచ్చు మధ్యలో బాబు గారిని కలిశారు అంటే లాబీయింగ్ కోసమా..?

  3. ఐఏఎస్, ఐపీస్ అంటే ప్రజల్లో చాల గౌరవం వుంది.

    శంకర్ దాన్ని ఎరుపు కింద చూపించాడు గేమ్ చెంజర్ లో…

    కిరో కిట్టి దాన్ని ఇంకా రోత చేస్తున్నాడు.

    ఇంత దిగజారిపోయారా …వాళ్ళకి ఐక్యత, అధికారం లేదా….తాకట్టు పెట్టేశారా

Comments are closed.