జ‌గ‌న్ కోట‌రీ … స్వ‌యంకృతాప‌రాధం!

రాజ‌కీయాల్లో మూడు ద‌శాబ్దాలు రాణించాల‌ని క‌ల‌లు కంటున్న జ‌గ‌న్‌, ఇప్ప‌టికైనా త‌న పంథాపై పున‌రాలోచ‌న చేసుకోవాల్సిన అవ‌స‌రం వుంది.

వైసీపీ ఘోర ప‌రాజ‌యం త‌ర్వాత సొంత పార్టీ నేత‌లు, అలాగే ఇత‌రులు ప్ర‌ధానంగా వైఎస్ జ‌గ‌న్ కోట‌రీపై వేలెత్తి చూపారు. తాజాగా విజ‌య‌సాయిరెడ్డి కూడా జ‌గ‌న్ కోట‌రీ వ‌ల్లే తాను వైసీపీ నుంచి బ‌య‌టికి రావాల్సి వ‌చ్చింద‌ని సంచ‌ల‌న కామెంట్ చేశారు. వైసీపీ ఓట‌మికి మ‌రెవ‌రినో నిందించాల్సిన ప‌నిలేదు. వైసీపీని కూట‌మి ఓడించింద‌ని అనుకుంటే పొర‌పాటే. జ‌గ‌న్ త‌న‌ను తాను ఓడించుకున్నారు. అజ్ఞానం, అహంకారం, లెక్క‌లేనిత‌నం త‌దిత‌ర కార‌ణాలు ఎన్నిక‌ల్లో వైసీపీ ఘోర ప‌రాజ‌యానికి కార‌ణ‌మ‌య్యాయి.

ఎవ‌రికి ఎంత ప్రాధాన్యం ఇవ్వాలో జ‌గ‌న్‌కు ఓ అంచ‌నా వుండ‌దు. మ‌న‌సులో అప్ప‌టికి ఏ ఆలోచ‌న క‌లుగుతుందో, దాన్ని అమ‌లు చేయ‌డం మాత్ర‌మే జ‌గ‌న్‌కు తెలుసు. వైఎస్ రాజ‌శేఖర‌రెడ్డి, నారా చంద్ర‌బాబునాయుడు రాజ‌కీయ పంథాల్ని గ‌మ‌నిస్తే… ఎంతో ముచ్చ‌టేస్తుంది. జ‌గ‌న్ వ్య‌వ‌హార శైలిని చూస్తే, అస‌హ్యం క‌లుగుతుంది.

వైఎస్సార్‌కు నీడ‌లా కేవీపీ రామ‌చంద్ర‌రావు ఉన్నారు. ఆయ‌నెప్పుడూ తెర ముందు క‌నిపించేవాళ్లు కాదు. ఏనాడూ కేవీపీ గురించి అంద‌రూ మాట్లాడుకోవ‌డం త‌ప్పితే, ఆయ‌న నోరు తెరిచి మాట్లాడ్డం వైఎస్సార్ జీవించినంత కాలం ఎవ‌రూ విన‌లేదు, చూడ‌లేదు. వైఎస్సార్ రాజ‌కీయ ప్ర‌యోజ‌నాలే కేవీపీకి ముఖ్యం. అందుకోసం తెర వెనుక ఏం చేయాలో, ఆ ప‌నులన్నీ ఆయ‌న చ‌క్క‌బెట్టేవారు. వైఎస్సార్ ఆత్మ తెలిసిన నాయ‌కుడు కావ‌డంతో, ఎవ‌రికి ఏ ప‌నులు చేయాలో కేవీపీ ఇబ్బంది లేకుండా చేసిపెట్టేవారు. అందుకే ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్ లాంటి నాయ‌కులు వైఎస్సార్‌ను ఎంత ప్రేమిస్తారో, అంతేస్థాయిలో కేవీపీని కూడా అభిమానిస్తారు.

వైఎస్సార్‌ను క‌ల‌వ‌డానికి ఎలాంటి అడ్డుగోడలు వుండేవి కావు. కేవీపీ స్థాయిలోనే ఏవైనా చేయాల్సిన‌వి వుంటే జ‌రిగిపోయేవి. ఒక‌వేళ వైఎస్‌ను క‌ల‌వాలంటే, దానికి పెద్ద‌గా ఇబ్బందులు వుండేవి కావు. నిత్యం వైఎస్సార్ జ‌నాన్ని క‌లిసే వాళ్లు. అందుకే సామాన్యుల‌కు కూడా వైఎస్సార్ చేరువ‌గా వుండేవారు.

చంద్ర‌బాబు విష‌యానికి వ‌స్తే, ఎవ‌రికి ఎంత ప్రాధాన్యం ఇవ్వాలో ఆ మేర‌కే ప‌రిమితం. ముఖ్యంగా నాయ‌కుల అర్హ‌త‌ల‌ను బ‌ట్టి చంద్ర‌బాబు ద‌గ్గ‌రికి తీసుకునేవారు. పిండికొద్ది రొట్టే అనే చందంగా, నాయ‌కుల కెపాసిటీని అంచ‌నా క‌ట్టి, ప‌ద‌వులు, ఇత‌ర‌త్రా అంశాల్లో ప్రోత్సాహం ఇస్తారు. అందుకే చంద్ర‌బాబును వీడాల్సి వ‌చ్చినా, ఆయ‌న్ను విమ‌ర్శించిన దాఖ‌లాలు క‌నిపించ‌వు. టీడీపీని వీడి, బీజేపీలో చేరిన నాయ‌కులు… ఇప్ప‌టికీ చంద్ర‌బాబు రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోస‌మే ప‌ని చేస్తుండ‌డం చూస్తున్నాం. ఇంత‌కూ వీళ్లంతా టీడీపా? బీజేపా? అనే అనుమానం వాళ్ల మాట‌లు వింటే అనుమానం క‌లుగుతుంది.

కానీ జ‌గ‌న్ అలా కాదు. న‌చ్చితే నెత్తిన పెట్టుకోవ‌డం, లేదంటే ఒక్క‌సారిగా కింద‌ప‌డేయ‌డం. దీంతో అంత వ‌ర‌కూ చాలా ద‌గ్గ‌ర‌గా ఆద‌ర‌ణ పొందిన వాళ్లే, తిరుగుబాటు బావుటా ఎగుర‌వేస్తుంటారు. ఈ ధోర‌ణి జ‌గ‌న్ ఇంటి నుంచే చూడొచ్చు. కాంగ్రెస్‌లో జ‌గ‌న్ ఉన్న‌పుడు సోనియా గాంధీని క‌ల‌వ‌డానికి విజ‌య‌మ్మ‌, ష‌ర్మిల‌తో క‌లిసి జ‌గ‌న్ వెళ్లారు. భార్య భార‌తి వెంట క‌నిపించ‌లేదు. పాప‌.. పాప‌ అంటూ జ‌గ‌న్ విప‌రీత‌మైన ప్రేమ క‌న‌బరిచే వారు. ఆ పాపే.. నేడు పాము అయ్యిందని వైసీపీ శ్రేణుల విమ‌ర్శ‌.

తాజాగా విజ‌య‌సాయిరెడ్డి వ్య‌వ‌హారం. వైఎస్సార్ కుటుంబ వ్యాపార‌ లావాదేవీలు చూసుకునే విజ‌య‌సాయిరెడ్డికి జ‌గ‌న్ రాజ‌కీయంగా ప్రాధాన్యం ఇచ్చారు. రాజ‌కీయాలు, వ్యాపారాలు వేర్వేర‌ని జ‌గ‌న్ అనుకోలేదు. త‌న‌కు న‌మ్మ‌క‌స్తుడ‌ని భావించి, త‌న త‌ర్వాత విజ‌య‌సాయిరెడ్డే అన్నంత ప్రాధాన్యం ఇచ్చారు. త‌న‌తో పాటు జైలు జీవితం అనుభ‌వించార‌న్న కృత‌జ్ఞ‌త జ‌గ‌న్‌కు ఉండొచ్చు. అయితే విజ‌య‌సాయిరెడ్డికి ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల‌తో సంబంధం లేదు. ఒక‌సారి నెత్తికి ఎత్తుకున్న జ‌గ‌న్ …ఆ త‌ర్వాత నెమ్మ‌దిగా భుజాల మీదికి, చంక‌లోకి, అనంత‌రం నేల‌మీద విడిస్తే కోపం రాదా? విజ‌య‌సాయిరెడ్డి స్థానంలో ఎవ‌రున్నా, త‌న‌ను ప‌క్క‌న పెట్టార‌నే అనుకుంటారు.

జ‌గ‌న్ కోట‌రీలో విజ‌య‌సాయిరెడ్డి కూడా ప్ర‌ముఖుడే. వైసీపీ అధికారంలో ఉన్న‌పుడు విజ‌య‌సాయిరెడ్డి అనుభ‌వించ‌ని రాజ‌భోగం లేదు. సంపాద‌న‌కు త‌క్కువేం లేదు. అధికారిక ప్రొటోకాల్ స‌రేస‌రి. ఇప్పుడు ఎక్క‌డో తేడా కొట్టింది. మంది పెరిగితే మ‌జ్జిగ ప‌లుచ‌న అవుతాయ‌నే సామెత చందంగా… కోట‌రీలో నాయ‌కులు పెరిగితే, స‌హ‌జంగానే ప్రాధాన్య‌త‌లు కూడా త‌గ్గుతాయి. ఎప్పుడూ ఒకే ర‌క‌మైన ప్రాధాన్యం ఇవ్వాల‌ని కోరుకోవ‌డంలో త‌ప్పులేదు. కానీ అది సాధ్యం కాద‌ని గ్ర‌హించాల్సి వుంటుంది. ఆంధ్ర క్రికెట్ అసోసియేష‌న్‌ను విజ‌య‌సాయిరెడ్డి త‌న సొంత కంపెనీలా భావించి, దాన్ని ఎవ‌రెవ‌రితో నింపారో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఇవ‌న్నీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని చేసిన‌వి కావా? చివ‌రికి మూల్యం చెల్లించుకున్న‌ది మాత్రం జ‌గ‌నే క‌దా?

కోట‌రీలో మ‌రో కీల‌క నాయ‌కుడు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి. జ‌ర్న‌లిజం నేప‌థ్యం నుంచి వ‌చ్చారు. సాక్షి ప‌త్రిక‌కు ఎడిటోరియ‌ల్ డైరెక్ట‌ర్‌గా ప‌ని చేశారు. స‌జ్జ‌ల‌ను మీడియా సంస్థ‌ల బాధ్య‌త‌ల వ‌ర‌కే ప‌రిమితం చేసి వుంటే బావుండేది. కానీ ఆయ‌న్ను పార్టీలోకి తీసుకున్నారు. జ‌గ‌న్ నీడ‌లా వ్య‌వ‌హ‌రిస్తూ వ‌చ్చారు. వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత స‌జ్జ‌ల ప్రాధాన్యం విప‌రీతంగా పెరిగింది. సీఎం జ‌గ‌న్‌కు ప్ర‌ధాన స‌ల‌హాదారుడిగా నియ‌మితుల‌య్యారు.

వైఎస్సార్‌కు కేవీపీ, జ‌గ‌న్‌కు స‌జ్జ‌ల అన్న రేంజ్‌లో ప్ర‌చారం జ‌రిగింది. అయితే కేవీపీ ఏనాడూ మీడియా ముందు క‌నిపించేవాళ్లు కాదు. కానీ స‌జ్జ‌ల వ్య‌వ‌హారం అందుకు పూర్తి విరుద్ధం. ప్ర‌తిదానికీ టింగురంగా అంటూ స‌జ్జ‌ల మీడియా ముందుకు వ‌చ్చేవాళ్లు. స‌జ్జ‌ల వ‌ల్లే వైసీపీ స‌గం నాశ‌నం అయ్యింద‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తినా, నేటికీ అదే ప్రాధాన్యం. ఇంకా స‌జ్జ‌ల పాత్ర పెరిగింద‌నే మాట వినిపిస్తోంది. స‌జ్జ‌ల త‌న కుమారుడు భార్గ‌వ్‌రెడ్డిని కూడా తీసుకొచ్చి, సోష‌ల్ మీడియా బాధ్య‌త‌లు అప్ప‌గించారు. ఆ మీడియా ఎలా ప‌ని చేసిందో అంద‌రికీ తెలుసు. ఇక సంపాద‌న విష‌యంలో స‌జ్జ‌ల ఎక్క‌డికో వెళ్లిపోయార‌నే మాట వినిపిస్తోంది.

కోట‌రీలో మ‌రో ముఖ్య నాయ‌కుడు చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి. ఈయ‌న గొప్ప‌త‌నం ఏంటంటే… పాము త‌న పిల్ల‌ల్ని తానే తింటుంద‌ని వింటుంటాం. చెవిరెడ్డి కూడా అలాంటి వాడే. చెవిరెడ్డి ఎక్క‌డుంటే, ఆ చుట్టూ మ‌రెవ‌రినీ దరిదాపుల్లోకి కూడా రానివ్వ‌రు. జ‌గ‌న్ ప‌క్క‌నే వుంటూ, జ‌గ‌న్ చెవిలో జోరీగ‌లా సొంత పార్టీ నేత‌ల గురించే నెగెటివిటీని చెబుతుంటార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. చంద్ర‌గిరి నుంచి ఒంగోలుకు తీసుకెళ్లి ఎంపీగా పోటీ చేయించాల్సిన అవ‌స‌రం ఏంటి? చెవిరెడ్డికి అందలం ఎక్కించ‌డం అంటే, ఇత‌రుల్ని దూరం చేసుకోవ‌డ‌మే అని వైసీపీలో పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. వైసీపీలో చెవిరెడ్డిని ముద్దుగా పుష్ప అని పిలుస్తుంటారు. ఎందుకు? ఏమిటి? అని వైసీపీ నాయ‌కుల్ని అడిగితే స‌రిపోతుంది.

కోట‌రీలో కీల‌క నాయ‌కుడు వైవీ సుబ్బారెడ్డి. ఈయ‌న‌కు రాజ‌కీయ ఆకాంక్ష ఎక్కువ‌. జ‌గ‌న్‌తో ద‌గ్గ‌రి బంధుత్వాన్ని అడ్డు పెట్టుకుని కోట‌రీలో చ‌క్రం తిప్పుతున్నారు. వైసీపీ అధికారంలోకి రావ‌డ‌మే ఆల‌స్యం… నాలుగేళ్ల పాటు టీటీడీ చైర్మ‌న్ ప‌ద‌విని అనుభ‌వించారు. మ‌రోవైపు వైవీ కుమారుడు విక్రాంత్‌రెడ్డి అక్ర‌మ మైనింగ్‌, పోర్టుల్లో వాటాల గురించి అంద‌రికీ తెలిసిన విష‌యాలే. టీటీడీ చైర్మ‌న్ ప‌ద‌వీ కాలం ముగియ‌గానే, వైవీకి రాజ్య‌స‌భ స‌భ్య‌త్వం. వైసీపీకి వైవీ వ‌ల్ల న‌యా పైస ఉప‌యోగం లేదు. కానీ జ‌గ‌న్‌ను అడ్డు పెట్టుకుని వైవీ అత్య‌ధిక ప్ర‌యోజ‌నాలు పొందారు.

కోట‌రీలో మ‌రో ముఖ్య నాయ‌కుడు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి. వైసీపీ అధికారంలో వుండ‌గా మైన్స్‌, లిక్క‌ర్ త‌దిత‌ర వ్యాపారాల్లో అన్నీ తానై చ‌క్రం తిప్పారు. వ్యాపారాల్లో ఆదాయ లెక్క‌లు చెప్ప‌డానికి ప్ర‌తి శ‌నివారం జ‌గ‌న్‌తో మిథున్ భేటీ అవుతార‌నే ప్ర‌చారం లేక‌పోలేదు. వైసీపీలో త‌మ‌కు గిట్ట‌ని వాళ్ల‌ను రాజ‌కీయంగా అంతం చేయ‌డంలో పెద్దిరెడ్డి కుటుంబానికి మ‌రొక‌రు సాటి రార‌నే గొప్ప పేరు వుంది. అయిన‌ప్ప‌టికీ జ‌గ‌న్ ఏమీ చేయ‌లేని నిస్స‌హాయ స్థితి.

బాలినేని శ్రీ‌నివాస్‌రెడ్డి గురించి త‌ప్ప‌క మాట్లాడుకోవాలి. వైసీపీ అధికారంలో ఉన్నంత వ‌ర‌కూ బాలినేని శ్రీ‌నివాస్‌రెడ్డి ఒక వెలుగు వెలిగారు. బాలినేని అంతా తానై ప్ర‌కాశం జిల్లాలో చ‌క్రం తిప్పారు. బంధుత్వాన్ని అడ్డం పెట్టుకుని బాలినేని ఆడిందే ఆట‌, పాడిందే పాట‌గా వ్య‌వ‌హారం న‌డిచింది. తీరా అధికారం పోయిన త‌ర్వాత‌…ఈయ‌న గారికి ఎక్క‌డలేని లోపాలు క‌నిపించాయి. చివ‌రికి జ‌గ‌న్‌ను వీడి, జ‌న‌సేన‌లో చేరి… దిక్కులేని విధంగా బ‌తుకీడుస్తున్నారు.

జ‌గ‌న్ కోట‌రీ వ‌ల్లే వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డి దంప‌తులు, మాగుంట శ్రీ‌నివాస్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి, లావు శ్రీ‌కృష్ణ‌దేవ‌రాయలు, ర‌ఘురామ‌కృష్ణంరాజు త‌దిత‌ర నాయ‌కుల్ని జ‌గ‌న్ పోగొట్టుకోవాల్సి వ‌చ్చింది. జ‌గ‌న్ చుట్టూ ఉన్న వాళ్ల‌ని గ‌మ‌నిస్తే… అంతా చిల్ల‌ర గుంపు. బ‌హుశా వ్య‌క్తిత్వం ఉన్న మ‌నుషులంటే జ‌గ‌న్‌కు న‌చ్చ‌న‌ట్టుంది. అందుకే ఆత్మాభిమానం ఉన్న నాయ‌కులెవ‌రూ జ‌గ‌న్ ద‌రిదాపుల్లో కూడా క‌నిపించ‌రు.

మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాద‌వ్ కోసం నెల్లూరు జిల్లాలో బ‌ల‌మైన నాయ‌కుడైన వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డి, ఆయ‌న భార్య ప్ర‌శాంతిని జ‌గ‌న్ కోల్పోయారు. దానికి త‌గ్గ మూల్యాన్ని జ‌గ‌న్ ఎన్నిక‌ల్లో చెల్లించుకున్నారు. ఇప్పుడు అనిల్‌కుమార్ యాద‌వ్ ఎక్క‌డున్నారో ఎవ‌రికీ తెలియ‌దు. అనిల్‌ను నెత్తికెత్తుకుని, ఇప్పుడు కింద‌ప‌డేశారు. ఇటు వేమిరెడ్డి, అటు అనిల్‌… ఇద్ద‌రూ లేకుండా పోయారు.

న‌ర‌సారావుపేట నుంచి నాగార్జున‌యాద‌వ్‌ను నిల‌బెట్ట‌డానికి బ‌ల‌మైన నాయ‌కుడైన లావు కృష్ణ‌దేవ‌రాయ‌ల్ని జ‌గ‌న్ పోగొట్టుకున్నారు. న‌ర‌సారావుపేట పార్ల‌మెంట్ ప‌రిధిలోని ఎమ్మెల్యే అభ్య‌ర్థులంతా….ఇలాగైతే తాము పోటీ చేయ‌లేమ‌ని చేతులెత్తేయడంతో మాజీ మంత్రి అనిల్‌ను తీసుకెళ్లి నిల‌బెట్టారు. చివ‌రికి కృష్ణ‌దేవ‌రాయ‌లు టీడీపీలో చేరి, అక్క‌డి నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఇప్పుడాయ‌న పార్ల‌మెంట్‌లో టీడీపీ ప‌క్ష నాయ‌కుడు కూడా.

ఒంగోలులో మాగుంట శ్రీ‌నివాస్‌రెడ్డిని ఎందుకు పోగొట్టుకున్నారో జ‌గ‌న్‌కే తెలియాలి. మాగుంట‌ను కాద‌నుకుని తిరుప‌తి జిల్లా నుంచి చెవిరెడ్డిని తీసుకెళ్లి, ఒంగోలు ఎంపీగా పోటీ చేయించాల్సిన దుస్థితి ఏర్ప‌డింది. స్థానికేత‌రుడైన చెవిరెడ్డిని క‌సికొద్ది ఓడించారు. నెల్లూరులో కూడా ఇదే జ‌రిగింది. నెల్లూరు నుంచి వైసీపీ త‌ర‌పున పోటీ చేయాల్సిన వేమిరెడ్డిని పోగొట్టుకోవ‌డంతో బ‌ల‌మైన అభ్య‌ర్థి లేక‌పోవ‌డంతో విజ‌య‌సాయిరెడ్డిని నిల‌బెట్టారు. ఇప్పుడు విజ‌య‌సాయిరెడ్డి కూడా జ‌గ‌న్ వెంట లేరు.

ఇవ‌న్నీ ప‌రిశీలిస్తే జ‌గ‌న్ స్వ‌యంకృతాప‌రాధంతోనే ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యాన్ని పొందారు. త‌న‌ను చూసి ఓట్లు వేస్తారే త‌ప్ప‌, నాయ‌కులెవ‌రనే లెక్క‌లేని త‌నం అధికారంలో ఉన్న‌ప్పుడు జ‌గ‌న్‌లో కనిపించింది. రెండు చేతులు క‌లిస్తేనే… చ‌ప్పుడు అవుతుంద‌ని జ‌గ‌న్ గ్ర‌హించ‌క‌పోవ‌డం అహంకారానికి నిద‌ర్శ‌నం. ఎప్పుడూ ఎవ‌రితో క‌ల‌వ‌క‌పోవ‌డం, ఇత‌రుల అభిప్రాయాల్ని తీసుకోక‌పోవ‌డం రాజ‌కీయాల్లో స‌రైంది కాదు. రాజ‌కీయాల్లో మూడు ద‌శాబ్దాలు రాణించాల‌ని క‌ల‌లు కంటున్న జ‌గ‌న్‌, ఇప్ప‌టికైనా త‌న పంథాపై పున‌రాలోచ‌న చేసుకోవాల్సిన అవ‌స‌రం వుంది. కాదు, కూడ‌దంటే… త‌న‌ను తానే ఎన్ని సార్లైనా ఓడించుకోగ‌ల‌న‌ని నిరూపించుకుంటూనే వుంటారు. అప్పుడు మ‌నుషులు కావాల‌ని కోరుకున్నా… వెంట ఎవ‌రూ వుండ‌ర‌ని తెలుసుకుంటే మంచిది.

-స్వేచ్ఛ‌

84 Replies to “జ‌గ‌న్ కోట‌రీ … స్వ‌యంకృతాప‌రాధం!”

  1. బాలినేని JSP కి ఒక రాకెట్ lantodu రా GA.

    2029 ఎలేచ్షన్స్ లో వాడతాం అప్పుడు తెలుస్తుంది దిక్కు లేనోళ్ళు ఎవరో, stay tuned

  2. ఇ మనిషి చుట్టూ వున్నది రెడ్డి కులస్తులు, వీరు మాత్రమే పవర్ సెంటర్లు, కానీ టీడీపీ నీ కమ్మ వాళ్ళను కులం పేరుతో ఎంత రాతలు రాస్తావు. జగన్ కూడ లెగిస్తే కమ్మ వాళ్ళను అంటాడు. ఇప్పుడు చెప్పండి మీది కుల పార్టీ కదా???

  3. ప్యాలస్ పులకేశి లక్షణాలు ఇలా బయటకి చెప్పేస్తే ఎలా?

    వినాశం గురించి రాస్తే, ప్యాలస్ లో ముఖ్యమైన వ్యక్తి కి కోపం వచ్చి మీ వెబ్సైట్ బిల్ ఆపేసిద్ది అని భయం వేసిందా ?

  4. తిక్కల్ మేళం గాడు అంటావు, చివరికి.

    ఇటువంటి వాడి చేతిలో ఒక రాష్ట్రం 5 ఏళ్లు పాటు వుంది. రాష్ట్రంలో యువకులు అందరూ చంక నాకిపోయార్. కానీ, ప్యాలస్ పులకేశి గాడు కి ఆస్తులు లక్ష లా కోట్లు పెరిగాయి.

  5. మీరు రాసిన ఈ అక్షరాలు… అక్షరాలా సత్యం. ఇదే విషయాన్నీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, వైసీపీ కార్యకర్తలు నాయకులూ జగనన్నకు చెప్పాలని ప్రయత్నం చేసినా వీలుకాలేదు కోటరీల వల్ల. అంతలోనే నష్టం వాటిల్లింది.

  6. రోజు ప్యాలస్ సాయంత్రం జరిగే పని.

    అలారం మోగుతుంది.

    అందరూ వరసగా నిలబడతారు.

    చిన్న రెడ్డి: అయ్య, ఇదిదో ఈ రోజు మైనిం*గ్ లో నేను 100 కోట్లు వసూళ్లు చేశాను. మీ వాటా 10 కోట్లు.

    గుబిలి రెడ్డి : అయ్య, నేను గం*ధం చెక్కలు లో 150 కోట్లు వసూళ్లు చేశాను. మీ వాటా 15 కోట్లు.

    గజ్జల రెడ్డి : అయ్య, నేను మొత్తం 500 కోట్లు వసూలు చేశాను ఈ రోజు. మీ వాటా 50 కోట్లు ఇదిగో.

    ..

    ప్యాలస్ పులకేశి రెడ్డి : మేడం, వీళ్ళందరి వాటా లతో పాటు, నేను ప*ప్జీ లో కోటి, గం*జాయి పొట్లాలు కట్టి 10 కోట్లు, నా అప్పోయింట్మెంట్ స్లాట్ అమ్ముకుని కోటి వచ్చాయి.

    ఇదిగో ఈ డబ్బు మొత్తం

    మీ భో*షానం లో దాచు కోండి.

    వంశి వచ్చాడు, మసాజు చెయ్యాలి అతనికి , వెళతాను.

    తాళాలు గుత్తి :

    ఇదో నాశనం బావ, ఇదిగో రోజ్ మిల్క్. తాగు..

  7. సజ్జల రామకృష్ణ రెడ్డి ప్లేస్ లో గ్రేట్ ఆంధ్ర అరికట్ల వెంకట్ రెడ్డి ని తన సలహాదారుడిగా జగన్ నియమించుకోవాలి.

  8. Ee anna ki kotari elago, aa anna ki lachi paru alaga annamata.

    Apudu kapadataniki vachadu okadu vachadu.

    Ipudu okadu Vi shanthi R save cheyakunda poyadu.

  9. So, the seesence is all the kotari people around jagan are useless and criminals. Still, some people think he is a great leader and want him to be one CM again. What an irony

  10. పిల్లలు వున్న ఇంట్లో పని మనిషి ఉద్యోగం ఇవ్వడానికే , పది సార్లు ఆలోచన చేస్తాం.

    అలాంటిది, ఒక రాష్ట్రం మొత్తం ఇలాంటి బెప్పం గాడు చేతిలో ఒక రోజు రెండు రోజూ లు కాదు, 5 ఏళ్ల పాటు వింది, పాతికేళ్ళు వెనక్కి పోయింది.

    రాష్ట్రం లో కష్టపడే ప్రజల అందరూ నష్ట పోయారు.

    ప్రజా*స్వామ్యం లో వున్న పెద్ద లోపం, ఇలాంటి వాడికి కూడా అధికా*రం దొరకడం.

  11. వీడు

    మంచి కొడుకు కాదు.

    మంచి ఆన్న కాదు.

    మంచి నాయకుడు కాదు.

    మంచి భక్తుడు కాదు.

    ..

    ఇలాంటి పనికి రాని చె*త్త వెధ*వ చేతిలో రా*ష్ట్రం 5 ఏళ్లు పాటు వుంది అని ఆలోచన చేస్తేనే భ*యం, భా*ద కలుగుతుంది.

  12. ఇప్పుడు చెప్పండి రా అబ్బాయిలు…. ఈవీఎం ల వల్ల ఓడిపోయాడా , వేసిన తప్పటడుగులు, తప్పుడు విధానాల కారణంగా ఓడిపోయాడా…. వాళ్ళ నాన్న పై వైరి పక్షాలలో కూడా అభిమానం ఉండేది హుందా తనం కారణంగా…. చంద్రబాబు గారు స్వయంగా ఆయనని మెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి…. వీడిని కనీసం కన్న తల్లి కూడా సమర్ధించదు…. కేవలం అధికారం తెచ్చుకుంటే వారసత్వం కాదు…. గౌరవం కూడా తెచ్చుకోవాలి….

  13. రేయ్,కోటరీ అని ఈడేదో శుద్ధపూస అన్నట్టు…ల.వడాలో రాతలు..అసలు సమస్య అంతా వాడే..ఫేక్ గాడు…వాడసలు రాజకీయ నాయకుడు ఏంది రా? మా ఖర్మ కాకపోతే వాడు సీఎం అవ్వుడు ఏంది….రాజకీయ చిత్ర పటం నుండి ఈడ్ని తప్పించినపుడే ఆంధ్రప్రదేశ్ సేఫ్.

    1. వాడి అయ్యా కు పట్టిన గతే పడితే చూడాలని చాలా మంది ఎదురుచూస్తున్నారు….

  14. వైస్సార్ కి లాయల్ గా ఉన్నవాళ్లు అందరు దూరమైపోతున్నారు . జగన్ కి ఎందుకు అర్ధం కావడం లేదో అర్ధం కావడం లేదు . ఎదో తేడాకొడుతోంది

    1. అందుకే కదా, ఈ నిజాలు ఫెడేల్ మని బయటకు వచ్చింది. Paytm పైసలు వచ్చాక, షరా మామూలే. అవే పొగడ్తలు, అదే సుత్తి కొట్టుడు భజనలు(అన్న తోపు, తురుము అని)..!

  15. అన్నీ బాగానే చెప్పావ్ కానీ… అస్సలు రాణీ గురించీ చెప్పలేదే… మేడం ఏం చెప్తే అదే చేస్తాడు… జగన్ వెనుక ఎవరూ వుండాలో డిసైడ్ చేసేది హారతి మేడం గారే కదా ???

    వీళ్లంతా జగన్ కోటరీ కాదు… హారతి మేడం కోటరీ అంటే 100% perfect.. గా వుంటుంది…

    పెళ్ళాం కోసం తల్లీ నీ, చెల్లి నీ దూరం పెడితే జనాలు ఎలా నమ్ముతారు…. కొంగ చాటు మొగుడు అనీ అందరూ గుసగుసలు వినిపిస్తున్నాయి మీ పార్టీ నేతలు నోటి నుంచే…

    పెళ్ళాం పర్మిషన్ లేకుండా ఏమీ చేయడూ.. ఆఖరికి బిజ్జల అబ్బా కొడుకులు నూ కూడా ఏమీ అనలేడూ అంటున్నారు… ముమ్మాటికీ ఇదీ హారతి మేడం కోటరీ యే….. కేవలం తెరపై నటుడు మాత్రమే జగన్ —- నిర్మాత, దర్శకత్వం , ఎడిటింగ్ , మాటలూ,పాటలూ, సంగీతం అంతా హారతి మేడం మే.అనీ అంటున్నారు… మీ పార్టీ నాయకులే….. ఆమె చెప్పకుండా అడుగు కూడా బయట పెట్టడూ..మా జగన్ సార్… అనీ అంటున్నారు కొందరు నెటిజన్లు…..

    1. ఊరుకోండి మాస్టారూ! అనాల్సినవి అనేసి, నెటిజన్ ల మీద తోసేస్తున్నారు మీరు మన ga ఆర్టికల్స్ లాగా..!😂😂😂

  16. Good article ……

    Jagan Failure idantha.. mithimeerina ahankaram…. Marali..maraka pothe party undadu.. peddaga time ledu..TIme undi anukuni last moment lo melkonte improvement ami undadu..

    Beyond this Jagan ki inka amanna alochanalu unte ( party mooseddamani kani, sajjalaki icheddamani gani anukunte ) avaru ami cheyaleru.

    Ivannee avadaina Jagan drushtiki pattukellandi

  17. దీనిని ఇంకో రకంగా కూడా చూడవచ్చు.

    జగ*న్ తన స్వా*ర్థం కోసం వీళ్ళు అందరినీ వాడుకుని వాళ్ళ నుండి ఇంకా కొత్తగా వచ్చే డబ్బు, లాభం లేదు అని అర్థం అయ్యాక,

    వాళ్ళని వదిలించుకుంటూ న్నాడు.

    ఇది ని*జం.

    జగ*న్ అనే వాడి నిజ స్వరూపం.

    వాడి అ*మ్మకి, చెల్లి* కి ఎప్పుడో అ*ర్థం అయ్యింది.

    వాడు విసిరేసిన బి*చ్చం డబ్బులు కోసం వాడికి ఇంకా డబ్బా కొడుతూ న్నావు.

    వాడికి తెలియ కుండా, వాడికి చెప్పకుండా వీళ్ళు ఇన్ని పనులు చేయగలరా ?

  18. jagan tho access undhi kabatte mundhe meeru cheppali meeru verevallu chepthene thelusthundha meeku jagan correct kadha mee dhrushti lo endhuku andharu vellipothunnaru papam

  19. ఎన్నాళ్లకు ఎన్నాళ్లకు వాస్తవాలు వ్రాసావు, అక్కడ కూడా కొంచెం వెళ్ళిపోయిన వాళ్లే తప్పుడోళ్ళు అనే నర్మ గర్భత ఉంది నీ రాతల్లో

  20. ఏదో ఆగష్టు 15 కి ఖైదీలని రిలీజ్ చేసినట్లు ఏడాదికి ఒక్కసారి ఇలా నిజాలు రిలీజ్ అవుతాయి…. దొంగే “దొంగా దొంగా” అని గట్టిగా అరిచేస్తే పార్టీ పై, అధినేత పై వ్యతిరేకత రాకుండా కేవలం కొద్ది వ్యక్తులపై కి మారుతుంది అని ఒక చిన్న ప్రయత్నం…. రేపు ఉదయం నించి మళ్ళీ యధావిదిగా “చంద్రబాబు దగా కోరు”, “పవన్ కళ్యాణ్ కి బాధ్యత లేదు”, “లోకేష్ రెడ్ బుక్”, “ప్రజలు పెగ్గు తాగి జెగ్గు కోసం ఎదురు చూస్తున్నారు” లాంటి శీర్షికలతో మీ మన్ననలు పొందుతాము…. అంతవరకు సెలవా మరి…

    1. వాడికి జనాలు దగ్గర దోచుకున్న డబ్బుతో సమ్మగా ఏసీ గదుల్లో పొర్లడం తో సరిపోతుంది. పార్టీ వాళ్ళని ఎక్కడ పట్టుచుకుంటాడు. జనాలు అంటే బానిసల కింద ఫీల్ అవుతాడు వాడు, తల్లి నీ తరిమేసి నా వెద్దవ వాడు.

  21. వాళ్ళ చేత ఆ తప్పుడు పనులు చెపించేదే,

    సొంత తల్లి నీ తరి*మేసి నా ఆ స*న్నాసి వాడు.

    వాడికి తెలియా కింద చేసే అంట దమ్ము ఉందా లేదు వాళ్ళకి.

  22. Pichi sannasi… nuvvu cheppina kotari loni okkokariki okko scam responsibility ichadu..

    Evaru ekkuva scam chesi techharo vallaki importance ichadu.. evaru baga nokkesi.. konchame icharo..vallani dooram pettadu…

    Ikkada profit and loss undi kaani… kotari… sacrifice…gratitude lantivatiki place ledu…

    Andaru kalisi janalani tunarukani…janam kosam okkadu pattinchukoledu

  23. ఇంతకీ మన అన్నియ్య చెన్నై లో స్టాలిన్ జరపతలపెట్టిన దక్షిణాది రాష్ట్రాల ఎన్డీయేతర పక్షాల సమావేశానికి వెళ్తున్నాడా?

  24. సొంత త*ల్లి అబ*ద్ధం చెప్పింది అని కో*ర్టుకు వెళ్లిన ఈ సన్నా*సి వాడిని ఇంకా మ*నిషి కింద లెక్క వేస్తూ న్నరా?

  25. రేయ్ యెబ్ర*సి గా,

    మా వైజాగ్ దళి*త డాక్టర్ సుధాకర్ గారి ఆ*త్మ నీ తల మీద నే గి*ర్రున ఫ్యా*న్ లాగ తిరుగుతూ వుంది, తెలుసా!

    రా రా, నిన్ను కూడా నీ నాన్న, చిన్నానా దగ్గరికి ఉబర్ రైడ్ లో చటుక్కున తీసుకు వెళత అని. రెడీ నా బె*వర్సు గా ?

  26. వైఎ*స్ఆర్ ఫ్యాన్ అందరూ, ప్యాలస్ పులకేశి గాడు యొక్క చెప్పు*లు నాకు*తూ బాని*స లాగ వున్నారు లాగ వింది.

  27. వాళ్ళకి రోజు 10 కోట్లు వ*సూళ్లు టా*ర్గెట్ పెట్టీ రాత్రి*కి ముక్కు పిండి వసూలు చేసేవాడు, వా*ళ్ళ దగ్గర , ఈ పే*డి ము*ఖం గాడు. వాళ్ళు కేవలం వాడికి ఏ*జెంట్ లు మాత్రమే.

  28. వినరో భాగ్యము విష్ణు కథా…………..ఆహా……ఓహో…….ఏమీ ఈ వీనుల విందు…

    సంవత్సరాల తరబడి ఎంత మొత్తుకొన్నా ఆలకిస్తేగా? ఒక పని చెయ్యండి వైసీపీ నిలబడాలంటే అన్నని పార్టీ నుంచి బహిష్కరించండి…

  29. 24 ఎన్నికల్లో ఓడిపోవడానికి కర్త, కర్మ, క్రియ.. అన్నీ జగనే!కూటమి నాయకుల ప్రతిభ కంటే జగన్ చేసుకున్న స్వయం కృతాపం వలనే ఘోర ఓటమి…!

  30. నిన్నటి నుండి GA జగన్ మీద వ్యాసాలు చూస్తుంటే అసలు వెబ్సైట్ పుట్టినప్పుడు నుండి ఉన్న GA నేనా అనిపిస్తోంది

  31. దీన్ని బట్టి, అన్న కు నాయకత్వ లక్షణాలు లేవు అని అర్థం అయ్యింది.

Comments are closed.