ఆమె నీతుల కోత‌లు.. క‌డ‌ప న‌వ్వుతోంది!

క‌డ‌ప ఎమ్మెల్యే ఆర్‌.మాధ‌వీరెడ్డి అవినీతిపై నీతులు కోట‌లు దాటేలా చెప్పారు. అవినీతిప‌రుల భ‌ర‌తం ప‌డ‌తామంటే, అంద‌రూ స్వాగ‌తిస్తారు.

క‌డ‌ప ఎమ్మెల్యే ఆర్‌.మాధ‌వీరెడ్డి అవినీతిపై నీతులు కోట‌లు దాటేలా చెప్పారు. అవినీతిప‌రుల భ‌ర‌తం ప‌డ‌తామంటే, అంద‌రూ స్వాగ‌తిస్తారు. వైసీపీ హ‌యాంలో కొంద‌రు విచ్చ‌ల‌విడిగా భూదందాల‌కు పాల్ప‌డి, దోచుకుని, డ‌బ్బు దాచుకున్నార‌ని ఆమె భారీ డైలాగ్‌లు కొట్టారు. దోచుకున్న సొమ్మంతా లాక్కుంటామ‌ని హెచ్చ‌రించారు. దోపిడీదారుల గ‌ల్లా పెట్టెలు ఖాళీ కావాల్సిందే అని ఆమె విరుచుకుప‌డ్డారు.

వైసీపీ హ‌యాంలో కొంద‌రు ఆ పార్టీకి చెందిన నాయ‌కులు భూదోపిడీకి పాల్ప‌డింది ముమ్మాటికీ నిజం. అలాంటి వాళ్ల ఆట క‌ట్టిస్తే స‌మాజం హ‌ర్షిస్తోంది. అయితే అవినీతి, దోపిడీ గురించి మాధ‌వీరెడ్డి నీతులు చెప్ప‌డం కాస్త విడ్డూరంగా వుంద‌ని క‌డ‌ప వాసులు అంటున్నారు. సుమ‌తి శ‌త‌కాల్లా, మాధ‌వి నీతి సూక్తుల్ని వింటూ క‌డ‌ప న‌గ‌రం న‌వ్వుతోంద‌ని నెటిజ‌న్లు వెట‌క‌రిస్తున్నారు. దీనికి కార‌ణం లేక‌పోలేదు.

అధికారం వ‌చ్చిందే అదునుగా భావించిన ఆమె గ‌త ప‌ది నెల‌ల్లో ఏం చేశారో న‌గ‌ర వాసులంద‌రికీ తెలుసుని క‌డ‌ప వాసులు అంటున్నారు. గ‌త పాల‌కుల చేష్ట‌లు న‌చ్చ‌క‌పోవ‌డం వ‌ల్లే మాధ‌వీరెడ్డిని ఎన్నుకున్నామ‌ని, అయితే కూట‌మి పాల‌న‌లో భూదందాలు, దౌర్జ‌న్యాల్ని చూస్తే, దిగిపోయిన పాల‌కులే మేలు అనే అభిప్రాయం ఏర్ప‌డింద‌ని క‌డ‌ప ప్ర‌జానీకం అంటోంది. మ‌రీ ముఖ్యంగా క‌డ‌ప‌లో మాధ‌వీరెడ్డి ఏలుబ‌డిలో భూదందాలు, దౌర్జ‌న్యాలు ఎలా సాగుతున్నాయో, ఆ న‌గ‌ర టీడీపీ అధ్య‌క్షుడితో పాటు ఆ పార్టీకి చెందిన నాయ‌కులు చేసిన విమ‌ర్శ‌ల్ని జ‌నం గుర్తు చేస్తున్నారు.

మాధ‌వీరెడ్డి ,ఆమె అనుచ‌రుల అరాచ‌కాల‌పై సీఎం చంద్ర‌బాబు, మంత్రి లోకేశ్‌కు ఫిర్యాదు చేయ‌డం వ‌ల్లే… క‌నీసం సొంత పార్టీ న‌గ‌ర అధ్య‌క్షుడ‌ని కూడా చూడ‌కుండా దాడి చేయించిన వైనాన్ని న‌గ‌ర వాసులు గుర్తు చేస్తున్నారు. గ‌తంలో ఎప్పుడూ ఇలాంటి ప‌రిణామాలు చోటు చేసుకోలేద‌ని, గ‌ట్టిగ‌ట్టిగా మాట్లాడితే అబ‌ద్ధాలు నిజాలు అయిపోతాయని మాధ‌వీ మేడ‌మ్ అనుకుంటున్న‌ట్టుగా వుంద‌నే కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి.

18 Replies to “ఆమె నీతుల కోత‌లు.. క‌డ‌ప న‌వ్వుతోంది!”

  1. మన జలగన్న అవినీతిని చూసి నవ్వటం కాదు విదేశాలు కూడా అసహ్యించుకుంటున్నాయి.

    1. నీకొచ్చి చెప్పారా విదేశాల ఏ భాషలో చెప్పారు ? సోదికూడా ఎంత నిజాయితీగా చెబుతారులే

  2. అధికారం లేకుండానే అన్న 43వేల కోట్ల అవినీతి అని కదా సిబిఐ, ED చెబుతున్నాయి…మరి అన్న అతి నిజాయితీ, అతి మంచితనం గురించి మాట మాట్లాడకపోతివి?

  3. స్వాతంత్రం వచ్చినప్పుటినుండి పులివెందులని ఒకరితర్వాత ఒకరు మీరే ఎలుతున్నారు కదరా.. కానీ ఇంతవరకు ఒక్క డ్యామ్ కట్టడం కానీ, కాలువ తవ్వి కనీసం ఒక్క ఎకరాకి నీళ్లు ఇవ్వలేదు కదరా.. తూ

    పులివెందులకి ఈడీ అచీవ్మెంట్ ఏందయ్యా అంటే.. చెబితే మీరు నవ్వుతారు.. అందుకే “చెప్పను బ్రదర్”

    1. Naku telisi pulivendula ni chala baga develop chesaru.. Ide vishayam ysr garu unnapudu eenadu paper lo kuda vimarsistu vesaru.. Ring road, IIIT lantivi chupistu.. Anni kadapa pulivendula ki matrame iste ela annattu rasaru..

      Asalu difference teliyalante kuppam tho compare chesi chuste evaru ek chesaro ardam avtadi

  4. నీ నీతులు కోతలకు మేము నవ్వు కుంటున్నాం వెంకట్రావు ..

Comments are closed.