సిద్ధు – ప్రతి సినిమాకు ఇదే తీరు?

అసలే సినిమాకు రావాల్సిన బజ్ రావడం లేదని నిర్మాత బాధపడుతున్నారు. ఇప్పుడు ఇలాంటి వార్తలు బయటకు వస్తే సినిమా మార్కెట్‌ను దెబ్బతీస్తాయి.

యంగ్ హీరోల మీద ఓ ముద్ర పడిపోకూడదు. అది చాలా ఇబ్బందికరంగా మారుతుంది. హిట్‌లు వచ్చినంత కాలం పర్వాలేదు. లేదంటే మరీ ప్రమాదం. యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ విషయంలో దర్శకులతో ఎప్పుడూ “క్రియేటివ్ డిఫరెన్స్” అనే మాట వినిపిస్తూనే ఉంది.

డీజే టిల్లు సినిమాను విమల్ కృష్ణ దర్శకత్వం వహించారు. కానీ ఏమయిందో తెలియదు, టిల్లు స్క్వేర్ కు మల్లిక్ రామ్ దర్శకుడిగా మారారు. ఆ సినిమా మేకింగ్ టైమ్‌లోనే చాలా గాసిప్‌లు వెలువడ్డాయి. మల్లిక్ రామ్ కేవలం పేరుకే దర్శకుడు, సినిమా అంతా సిద్ధు నే చేసుకుంటున్నాడన్నది ఆ గాసిప్‌ల సారాంశం.

టిల్లు సిరీస్ పెద్ద హిట్ కావడంతో, సిద్ధు రెమ్యూనరేషన్ భారీగా పెంచారని, 15 కోట్లు అడుగుతున్నారని వార్తలు వచ్చాయి. అదేం తప్పు కాదు. అతని రెమ్యూనరేషన్, అతని ఇష్టం. అలా ఒప్పుకున్న రెండు సినిమాలు తెలుసుకదా, జాక్. ఈ రెండు సినిమాలు అలా సెట్ మీద నడుస్తూనే ఉన్నాయి.

తెలుసుకదా సినిమాకు కొత్త దర్శకురాలు పని చేస్తున్నారు. అందువల్ల సిద్ధు దగ్గరుండి స్క్రిప్ట్ విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని, అందువల్ల లేట్ అవుతోందని వార్తలు వినిపించాయి.

జాక్ సినిమా విడుదల మరో రెండు వారాల్లో ఉంది. ఇంకా షూటింగ్ నడుస్తోంది. ఓ పాట కూడా తీయాల్సి ఉంది. ఈ లోగా, దర్శకుడు భాస్కర్‌కు, సిద్ధుకు పొసగడం లేదని వార్తలు వినిపించడం ప్రారంభమైంది. తను అనుకున్నట్లే సినిమా తీస్తానని దర్శకుడు, అలా కాదు ఇలా చేయాలి అని సిద్దు పట్టుదలకు పోతున్నారన్నది ఆ వార్తల సారాంశం. దీంతో ఇద్దరూ ఎడమొహం పెడమొహంగా వుంటున్నారు.

అసలే సినిమాకు రావాల్సిన బజ్ రావడం లేదని నిర్మాత బాధపడుతున్నారు. ఇప్పుడు ఇలాంటి వార్తలు బయటకు వస్తే సినిమా మార్కెట్‌ను దెబ్బతీస్తాయి.

ఒకసారి క్రియేటివ్ డిఫరెన్స్ వస్తే దర్శకుడి తప్పు ఉందేమో అనుకోవచ్చు. కానీ ప్రతి సారి అదే మాట వినిపిస్తే, సిద్ధుకు ఎవరితోనూ సరిపడదేమో అన్న అనుమానాలు వస్తాయి.

ప్రస్తుతం ఫర్వాలేదు. ఈ రెండు సినిమాల తర్వాత సితార సంస్థలో రెండు సినిమాలు లైన్‌లో ఉన్నాయి. కానీ మార్కెట్ డౌన్ అయితే ఆ సినిమాలకు కూడా ఇబ్బంది వస్తుంది. దర్శకులు దగ్గరకు రావడానికి ఆలోచిస్తారు. సిద్ధు గమనించుకోవాలి.

17 Replies to “సిద్ధు – ప్రతి సినిమాకు ఇదే తీరు?”

  1. Nud cal estanu >>> తొమ్మిది, మూడు, ఎనిమిది, సున్న, ఐదు, మూడు, ఏడు, ఏడు, నాలుగు, ఏడు.

  2. ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు >>> మేల్ ఎస్కార్ట్

  3. ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

  4. వర్క్ వుంది కాల్ మీ ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

  5. nijame, nithin, ram lanti vala selection ela unna ipdu vastunna rowdy boy,kiran abbavaram,viswaksen,siddu konchem achi toochi select cheskovali,’ka’ lanti concept oriented films chestey better

Comments are closed.