ఆ 2 సీక్వెల్స్ పై ఎన్టీఆర్ మౌనం

స్వయంగా మోహన్ లాల్ స్టేట్ మెంట్ ఇవ్వడంతో, జనతా గ్యారేజ్ సినిమాకు సీక్వెల్ తీయాలంటూ తారక్ ఫ్యాన్స్ డిమాండ్ చేయడం మరింత ఎక్కువైంది.

మొన్నటివరకు ఎన్టీఆర్ చుట్టూ చర్చల్లో ఉన్న సీక్వెల్ ఒకటి మాత్రమే. అదే దేవర-2. కానీ ఇప్పుడు మరో సీక్వెల్ కూడా వచ్చి చేరింది. అదే జనతా గ్యారేజ్-2. ఆశ్చర్యకరంగా ఈ 2 సినిమాలు కొరటాల శివవే కావడం విశేషం.

నిజానికి జనతా గ్యారేజీ సినిమా సీక్వెల్ ప్రతిపాదన లేదు. తారక్ ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమా సీక్వెల్ కావాలని కోరుతుంటారు. ఎందుకంటే, అది ఓపెన్ ఎండ్ మూవీ. ఇప్పుడీ చర్చ మరోసారి మొదలవ్వడానికి కారణం మోహన్ లాల్.

మోహన్ లాల్ కు టాలీవుడ్ లో మరోసారి గుర్తింపు తెచ్చిన చిత్రం జనతా గ్యారేజ్. ఇంకా చెప్పాలంటే, ఈ సినిమా తర్వాతే మోహన్ లాల్ కు తెలుగులో మరింత క్రేజ్ పెరిగింది. అలాంటి సినిమాకు సీక్వెల్ తీస్తే నటించడానికి రెడీ అని ఆయన ప్రకటించడం ఆసక్తికరంగా మారింది.

స్వయంగా మోహన్ లాల్ స్టేట్ మెంట్ ఇవ్వడంతో, జనతా గ్యారేజ్ సినిమాకు సీక్వెల్ తీయాలంటూ తారక్ ఫ్యాన్స్ డిమాండ్ చేయడం మరింత ఎక్కువైంది.

ఇప్పటికే తారక్ చేతిలో దేవర-2 ఉంది. దానిపైనే ఇంకా ఎలాంటి స్ఫష్టత ఇవ్వలేదు. అంతలోనే జనతా గ్యారేజ్-2 కావాలంటూ విన్నపాలు, డిమాండ్స్ పెరుగుతున్నాయి. ఈ రెండు సినిమాల సీక్వెల్స్ పై ఎన్టీఆర్ ఎలా రియాక్ట్ అవుతాడో.. ఎప్పుడు రియాక్ట్ అవుతాడో..!

3 Replies to “ఆ 2 సీక్వెల్స్ పై ఎన్టీఆర్ మౌనం”

Comments are closed.