రిపబ్లిక్ టీవీ ఆర్నాబ్ కు, మహరాష్ట్ర ప్రభుత్వానికి మధ్య వ్వవహారం సమసిపోయినట్లు కనిపించడం లేదు.
టీఆర్పీ కుంభకోణం కేసులో ఆర్నాబ్ ను మహరాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేయడం, సుప్రీం కోర్టులో బెయిల్ లభించడం తదితర పరిణామాలు తెలిసినవే.
లేటెస్ట్ గా పోలీస్ స్టేషన్ నుంచి ఈ కేసుకు సంబంధించిన పలువురి వాట్సాప్ చాట్ లు లీక్ అయ్యాయి.
కేవలం ఆర్నాబ్ వి మాత్రమే కాకుండా రిపబ్లిక్ టీవీ చీఫ్ ఆర్నాబ్ గోస్వామి, బార్క్ మాజీ సీఈవో పార్థోదాస్ గుప్తా సహా పలువురి మధ్య జరిగిన సంభాషణలు లీక్ అయ్యాయి.
ఇవన్నీ ఒకటి రెండు కాదు. పేజీలకు పేజీలు, దాదాపు 80ఎంబి సైజ్ వున్న మెసేజ్ లు లీక్ అయ్యాయి. అర్నాబ్ తో సహా పలువురు చేసిన చాట్ లు, ఆ చాట్ ల్లో కేంద్ర మంత్రులు, ప్రభుత్వం గురించి వాఖ్యానాలు చాలా వున్నాయి.
అవన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆర్నాబ్ మీద కసిగా వున్న వారు ఇవన్నీ షేర్ చేస్తూ, ఇవి చాలవా సాక్ష్యాలుగా అంటూ కామెంట్ చేస్తున్నారు.
ఇవన్నీ ఓ పోలీస్ స్టేషన్ నుంచి లీక్ అయినట్లు అనుమానిస్తున్నారు. ఎందుకంటే పదుల సంఖ్యలో వున్న ఈ స్క్రీన్ షాట్ ల పేజీలపై పలు సంతకాలు వున్నాయని, అవన్నీ అధికారుల సంతకాలు అయి వుంటాయని భావిస్తున్నారు.
ఇప్పుడు ఈ కొత్త దుమారం ఏ దిశగా సాగుతుందో చూడాలి.