cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie News

పింక్ రంగు ఇంతలా మార్చేస్తే ఎలా సాబ్?

పింక్ రంగు ఇంతలా మార్చేస్తే ఎలా సాబ్?

పింక్ రీమేక్‌లో పవన్ నటిస్తాడని, అమితాబ్ పాత్రను పవన్ చేస్తాడని తెలిసినపుడు ఫాన్స్ కూడా షాకయ్యారు. అంత పాసివ్ రోల్‌లో పవర్‌స్టార్‌ని ఎలా చూస్తామనుకున్నారు. 

అయితే తమిళంలో అజిత్ కుమార్ ఇమేజ్‌కి అనుగుణంగా మార్పులు చేయడంతో అదే తరహాలో ఇక్కడా చేద్దామనుకున్నారు. అయితే తమిళంలో ఒక ఫైట్ సీన్, రెండు, మూడు సన్నివేశాల మినహా పెద్దగా మార్పులు చేయలేదు.

అలా తీసినా పవన్ ఇమేజ్‌కి కష్టమనిపించడంతో ‘పింక్’ రీమేక్ అయిన ‘వకీల్ సాబ్’లో ఏకంగా మూడు ఫైట్లు పెట్టేసారు. అమితాబ్, అజిత్ మాదిరిగా ఏదో ట్రాన్స్‌లో వున్న వకీల్‌లా కాకుండా అసహనంతో ఊగిపోయే లాయర్‌గా పవన్‌ని చూపిస్తున్నారు. 

టీజర్‌లో షాట్లు చూస్తే... పవన్ వాచ్‌ను చేతిలో తిప్పుతూ, పెన్‌ని పదే పదే నొక్కుతూ, కాళ్లు ఆడిస్తూ ఎంత అసహనంగా కనిపిస్తాడో చూసే వుంటారు.

ఈ మార్పుల వల్ల పవన్ పవర్‌ఫుల్‌గా కనిపిస్తున్నాడు కానీ కథ ఏమవుతుందనేది తెలియదు. పైగా ఇది రీమేక్ అయినా కానీ దర్శకుడు శ్రీరామ్ వేణు ‘రచన’ అంటూ క్రెడిట్ తీసుకున్నాడు కనుక భారీగానే మార్పులు జరిగాయనేది తెలుస్తోంది. 

అసలు కథ సైడ్ అయిపోకుండా పవన్ పవర్‌ఫుల్‌గా కనిపించి, ఆడవాళ్ల సెంటిమెంట్‌కు తగ్గ మాటలు మాట్లాడితే ‘వకీల్ సాబ్’ వసూల్ సాబ్ అయ్యే ఛాన్స్ అయితే వుంది.  

జ‌య‌మ్మ క్యారెక్ట‌ర్ ఇంత బాగా రావడానికి కార‌ణం అయ‌నే

మంచి కిక్‌ ఇచ్చారు

 


×