Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

తెరవెనుకే త్రివిక్రమ్..ఏలనో?

తెరవెనుకే త్రివిక్రమ్..ఏలనో?

పవన్ కళ్యాణ్ తో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా చేయడానికి జంకుతున్నారా? లేదా అజ్ఞాతవాసి ఎఫెక్ట్ తో చేయకూడదు అనుకుంటున్నారా? కానీ సెట్ మీదకు వెళ్లడం తప్ప అన్నీ చేస్తూ ఒక సినిమాను పవన్ తో చేయబోతున్నారు. అదే అయ్యప్పన్ కోషియమ్ రీమేక్.

ఈ సినిమాకు కర్త, కర్మ, క్రియ అన్నీ త్రివిక్రమ్ నే. అందులో సందేహం లేదు. అసలు అయ్యప్పన్ సినిమాను పవన్ దృష్టికి తీసుకెళ్లిన దగ్గర నుంచి ప్రాజెక్ట్ ను డిజైన్ చేయడం వరకు చేసింది అంతా త్రివిక్రమ్ నే. స్టార్ కాస్ట్ సెలక్షన్, టెక్నికల్ కాస్ట్ సెలక్షన్ కూడా త్రివిక్రమ్ నే.

అయ్యప్పన్ సినిమా కథను తెలుగుకు, పవన్ ఇమేజ్ కు అనుగుణంగా కూడికలు, తీసివేతలు చేయించింది త్రివిక్రమ్. టోటల్ గా స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తోంది త్రివిక్రమ్. మరి ఇవన్నీ చేస్తుంటే ఇక మిగిలింది కేవలం డైరక్షన్. చిత్రమేమిటంటే తివిక్రమ్ తొలిదశలో గతంలో విజయ్ భాస్కర్ అనే దర్శకుడికి తెరవెనుక అన్నీ తానై వుండేవారు.

సెట్ మీద మాత్రం విజయ్ భాస్కర్ కనిపించేవారు. ఇప్పుడు ఇంత పేరు ప్రఖ్యాతులు సంపాదించాక కూడా  తెరవెనుక అన్నీ తానై వుంటూ, సెట్ మీద సాగర్ అనే చిన్న దర్శకుడిని పెట్టడం వెనుక త్రివిక్రమ్ ఆంతర్యం ఏమై వుంటుంది?

అజ్ఞాతవాసి పరాజయం వెనుక కేవలం కథ, కథనాలు, సినిమా వ్యవహారమే కాకుండా, రాజకీయాలు కూడా వున్నాయని త్రివిక్రమ్ నమ్ముతున్నారని టాక్ వుంది. ఇప్పటికీ అదే పరిస్థితి వుందో? లేదో? తెలియదు. వుంటే అనవసరంగా త్రివిక్రమ్ పేరు పాడవుతుంది.

నిజానికి పవన్ తో త్రివిక్రమ్ సినిమా చేయాలి అని అనుకంటే ఆపేవారు లేరు.. అన్నింటికన్నా ముందు ఆయన సినిమానే వుంటుంది. లేదా అయ్యప్పన్ ను తనే చేయాలనుకున్నా, ఎన్టీఆర్ సినిమా తరువాత చేయొచ్చు. దానికేమీ అంత అర్జెన్సీ లేదు.

మరి ఎందుకు అన్నీ తానై వ్యవహరిస్తూ, టెక్నీషియన్లు అందరికీ తానే అన్నీ సూచిస్తూ కూడా త్రివిక్రమ్ డైరక్టర్ గా తాను వ్యవహరించాలని అనుకోవడం లేదు? ఇదే మిలియన్ డాలర్ల ప్రశ్న.జవాబు బహుశా ఈ సినిమా విడుదల తరువాత  తెలుస్తుందేమో?

జ‌య‌మ్మ క్యారెక్ట‌ర్ ఇంత బాగా రావడానికి కార‌ణం అయ‌నే

మంచి కిక్‌ ఇచ్చారు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?