ప్రేమికుల రోజున తమ ప్రేమను పంచుకుంటూ అనేక జంటలు ఫొటోలను షేర్ చేస్తూ ఉంటాయి. వేలంటైన్స్ డేను సోషల్ మీడియా షేర్ ల ద్వారా అనేక మంది సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఇలాంటి వారిలో బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఉన్నారు. అనేక మంది తారలు తమ పార్ట్ నర్ తో తమ ప్రేమబంధాన్ని సోషల్ మీడియా వేదికగా వ్యక్తీకరించుకున్నారు ఈ రోజు.
మరి ఇలాంటి పనే చేసిన ఒక జంటపై మాత్రం ట్రోలింగ్ జరుగుతూ ఉంది. ఈ జంటే మలైకా అరోరా, అర్జున్ కపూర్. కొన్నాళ్లు పాటు తమ ప్రేమబంధాన్ని రహస్యంగా నెరిపిన వీళ్లు ఆ తర్వాత ఓపెనప్ అయిపోయారు. జంటగా విహరిస్తూ ఉన్నారు. ఆ ఫొటోలను పోస్టు చేస్తూ ఉంటారు.
ఈ జంటకు సంబంధించి ఆది నుంచి చర్చలో ఉన్న అంశం ఏజ్ గ్యాప్. అర్జున్ కపూర్ కన్నా చాలా పెద్దది అయిన మలైకా అతడితో ప్రేమబంధాన్ని సాగిస్తూ ఉంది. భర్తకు విడాకులు ఇచ్చింది కూడా అర్జున్ కపూర్ కోసమే అనే ప్రచారమూ ఉంది. ఎవరేమనుకున్నా.. లెక్క చేయక వీరు ప్రేమలో మునిగి తేలుతూ ఉన్నారు.
అర్జున్ కపూర్ పై కూడా ఈ బంధానికి సంబంధించి ఒత్తిళ్లు వచ్చాయనే టాక్ కూడా ఉంది. మరి ఇంత జరిగినా.. వీరు సగటు బాలీవుడ్ ప్రేమ బంధాలతో పోలిస్తే ఎక్కువ కాలంగానే ప్రేమలో ఉన్నారు. అయితే జనాలు మాత్రం వీరిని యాక్సెప్ట్ చేసేలా లేరు. వేలంటైన్స్ డే సందర్భంగా వీరు పోస్టు పెడితే ట్రోల్ చేస్తున్నారు. వీరి ప్రేమను ఎద్దేవా చేస్తూ ఉన్నారు.
వయసులో వ్యత్యాసం, మలైకా విడాకులు.. ఇవన్నీ ఆ జంటకు కంఫర్ట్ గానే అనిపిస్తున్నా, జనాలకు మాత్రం ఇవన్నీ సమంజసంగా అనిపించడం లేదు. ఈ సందర్భంలోనూ వదలకుండా వీరిని ట్రోల్ చేస్తున్నారు. బహుశా ఆ ట్రోల్స్ ను ఈ జంట లెక్క చేసే పరిస్థితిలో కూడా లేదు!