కొన్నాళ్ల కిందట తన ప్రేమ విషయాన్ని బయటపెట్టింది రకుల్. నటుడు, నిర్మాత జాకీ భగ్నానీతో డేటింగ్ చేస్తున్నట్టు ప్రకటించింది. అయితే అఫీషియల్ గా లవ్ మేటర్ బయటపెట్టింది కానీ, ఆ తర్వాత రకుల్-జాకీ పెద్దగా బయట కనిపించలేదు. ఇదే ప్రశ్న రకుల్ కు ఎదురైంది.
ప్రేమలో ఉన్న హీరోహీరోయిన్లంతా ఓపెన్ గా బయట తిరుగుతుంటే.. అధికారికంగా ప్రకటించి కూడా ఎందుకు పబ్లిక్ లో కనిపించడం లేదనే ప్రశ్న రకుల్ కు ఎదురైంది. దీనిపై రకుల్ ఓపెన్ గా రియాక్ట్ అయింది.
“మేమిద్దరం అంతే. ప్రతిది బయటపెట్టాలనే మనస్తత్వం కాదు మా ఇద్దరిది. మా డేటింగ్ ను సింపుల్ గా ఉంచాలనుకుంటున్నాం. ఫుడ్, జిమ్, జీవితాన్ని చూసే విధానంలో మేమిద్దరం ఒకేలా ఆలోచిస్తాం. నిజంగా డేటింగ్ గురించి మాట్లాడాలనిపిస్తే, సరైన టైమ్ లో మళ్లీ స్పందిస్తాం.”
ఇలా జాకీతో తన డేటింగ్ కొనసాగుతున్న విషయాన్ని స్పష్టంచేసింది రకుల్ ప్రీత్. ప్రియుడితో ప్రతి రోజూ కొత్తకొత్తగా ఉందంటున్న ఈ బ్యూటీ.. ప్రస్తుతం తామిద్దరం ఓ అందమైన ప్రపంచంలో విహరిస్తున్నట్టు అభివర్ణించింది. భవిష్యత్తులో తమ లవ్ మేటర్ కు సంబంధించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు కూడా ఇద్దరం చర్చించుకొని సోషల్ మీడియాలోకి వస్తామని క్లారిటీ ఇచ్చింది రకుల్.