లోకేశ్ ట్విట‌ర్ దిగ‌కు…వంశీకి క‌నిపిస్తే క‌ష్ట‌మే!

టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ అల‌వాటులో పొర‌పాటుగా గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీతో పెట్టుకున్నాడు. ట్విట‌ర్ క‌దా…త‌న‌నెవ‌రేం చేస్తార్లే అనే భ‌రోసాతో వంశీపై అవాకులు చెవాకులు రాసి ప‌డేశాడు. దీంతో వంశీకి…

టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ అల‌వాటులో పొర‌పాటుగా గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీతో పెట్టుకున్నాడు. ట్విట‌ర్ క‌దా…త‌న‌నెవ‌రేం చేస్తార్లే అనే భ‌రోసాతో వంశీపై అవాకులు చెవాకులు రాసి ప‌డేశాడు. దీంతో వంశీకి చిర్రెత్తుకొచ్చి ఘాటుగా స్పందించాడు. ఇప్పుడు సోష‌ల్ మీడియా వేదిక‌గా వారిద్ద‌రి మ‌ధ్య హాట్‌హాట్‌గా ర‌చ్చ సాగుతోంది. 

కొంత కాలం క్రితం టీవీ9లో టీడీపీ ఎమ్మెల్సీ బాబురాజేంద్ర‌ప్ర‌సాద్‌కు వంశీ చేతిలో ఘ‌న స‌త్కారాన్ని నెటిజ‌న్లు గుర్తు చేస్తూ…”అయ్యా లోకేశం ట్విట‌ర్ దిగొద్దు. విజ‌య‌వాడ ప‌రిస‌రాల్లో కొంత కాలం పాటు వంశీకి క‌నిపించ‌క‌పోవ‌డ‌మే ఎంత‌కైనా మంచిది” అని లోకేశ్‌కు సూచిస్తున్నారు. ఇంత‌కూ వారిద్ద‌రి మ‌ధ్య సోష‌ల్ మీడియా వార్ సంగ‌తేందో చూద్దాం.

సంతలో గొర్రెలు, గొర్రెల డాక్ట‌ర్ కొనుగోలుః లోకేశ్‌

అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను సంతలో గొర్రెలను కొన్నట్టు కొనుగోలు చేసింద‌ని, ఆ గొర్రెల‌తో పాటు గొర్రెల డాక్ట‌ర్ కూడా ఉన్నాడ‌ని నారా లోకేశ్ ట్వీట్ చేశాడు. గొర్రెల డాక్ట‌ర్‌గా వ‌ల్ల‌భ‌నేని వంశీని చూపించాడు. అంతేకాదు వంశీ-జ‌గ‌న్ క‌ల‌సి ఉన్న ఫొటోను లోకేశ్ షేర్ చేశాడు.

పిచ్చికుక్క‌కు వైద్యంః వంశీ

“మంగ‌ళ‌గిరి నుంచి పోటీ చేసిన లోకేశ్ చిత్తుగా ఓడిపోయాడు. ఇప్పుడు మండ‌లి ర‌ద్దుతో ఎమ్మెల్సీ ప‌ద‌వి కూడా ఊడిపోతుండ‌టంతో ఏం చేయాలో యువ‌నాయ‌కుడికి దిక్కుతోచ‌డం లేదు. ఎమ్మెల్సీ ప‌ద‌వి లేని జీవితాన్ని ఊహించుకుంటూ ఆయ‌న‌కు పిచ్చి ప‌ట్టిన‌ట్టుంది. నా ద‌గ్గ‌ర గొర్రెల‌కే కాదు పిచ్చి కుక్క‌ల‌కు కూడా వైద్యం ఉంది”

వెట‌ర్న‌రీ డాక్ట‌ర్ అయిన వంశీపై సెటైర్ వేసిన లోకేశ్‌….అదే స్థాయిలో వంశీ నుంచి ఘాటు విమ‌ర్శ‌లు ఎదుర్కోవాల్సి వ‌చ్చింది.  తండ్రి చంద్ర‌బాబుకు విప‌రీత‌మైన మీడియా పిచ్చి ఉంది. తండ్రికి మ‌ల్లే లోకేశ్‌ సోష‌ల్ మీడియాకు బానిస అయ్యిన‌ట్టున్నాడు. ప్ర‌తి చిన్న విష‌యానికి ఆయ‌న ట్విట‌ర్ వేదిక‌గా స్పందిస్తుంటాడు.

ఇప్పుడు ఏకంగా వ‌ల్ల‌భ‌నేని వంశీతో గోక్కున్న లోకేశ్‌కు నెటిజ‌న్లు జాగ్ర‌త్త‌లు చెబుతున్నారు. దీనికి కార‌ణం బాబురాజేంద్ర‌ప్ర‌సాద్‌కు వంశీ చేతిలో జ‌రిగిన ఘ‌న స‌న్మానం పున‌రావృతం కాకూడ‌ద‌నే అంటూ నెటిజ‌న్లు సెటైర్లు వేస్తున్నారు.

కోరి తెచ్చుకుంటే కాళ్ళు విరగొట్టారు కదా

ఆర్ఆర్ఆర్ 2021 సంక్రాంతికే