లారెన్స్..తమిళం..రుద్రుడు

లారెన్స్ తీసే తమిళ ఊరమాస్ సినిమాలు ఎలా వుంటాయి. లారెన్స్ చేసే అన్ని హంగులు కలిపిన ప్యాకేజ్ ఎలా వుంటుంది. అచ్చం అలాగెే వుంది రుద్రుడు ట్రయిలర్. లార్సెన్స్ లేటెస్ట్ మూవీ. ఇప్పటికి సవాలక్ష…

లారెన్స్ తీసే తమిళ ఊరమాస్ సినిమాలు ఎలా వుంటాయి. లారెన్స్ చేసే అన్ని హంగులు కలిపిన ప్యాకేజ్ ఎలా వుంటుంది. అచ్చం అలాగెే వుంది రుద్రుడు ట్రయిలర్. లార్సెన్స్ లేటెస్ట్ మూవీ. ఇప్పటికి సవాలక్ష సార్లు చూసేసిన కథ కథనాలు ట్రయిలర్ లో గుప్పుమంటున్నాయి. 

తమిళ కమర్షియల్ ఫార్ములా మీటర్ నుంచి ఒక్క అంగుళం కూడా పక్కకు జరగలేదు. హీరో అన్ని హంగులు, అర్హతలు వున్నవాడు. ఫైట్లు చేస్తాడు. డ్యాన్స్ లు చేస్తాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మంచివాడైన అతగాడిని కెలికారు. నానా ఇబ్బందులు పెట్టారు. దాంతో రుద్రుడిగా మారాడు. విలన్ భరతం పట్టాడు. ఇదే రుద్రుడు ట్రయిలర్ చెప్పే విషయం.

ఓ పాట చూస్తుంటే అలవైకుంఠపురములో పాట సెట్టింగ్ కు, హీరోయిన్ స్టయిలింగ్ కు, ఆర్ట్ వర్క్ కు ఇమిటేషన్ అని అర్థం అయిపోతోంది. నిజానికి ఇలాంటి సినిమాలకు ప్రేక్షకులు దూరంగా జరిగిపోయి చాలా కాలం అవుతోంది. కానీ లారెన్స్ ఇంకా ఇలాంటి కంటెంట్ నే పట్టుకుని వేలాడడం ఏమిటో?

కదిరేశన్ దర్శకత్వంలో ఈనెల 14న విడుదలవుతోంది రుద్రుడు సినిమా. ప్రియా భవానీ శంకర్ హీరోయిన్. శరత్ కుమార్ విలన్. తెలుగులో ఈ సినిమాను నిర్మాత టాగోర్ మధు విడుదల చేస్తున్నారు. జస్ట్ సి సెంటర్ ఎంటర్ టైనర్ గా సినిమాను తయారు చేయాలని దర్శకుడు కదిరేశన్ అనుకున్నట్లు కనిపిస్తోంది. ట్రయలర్ లో ఈ జనరేషన్ ఆడియన్స్ కు పట్టే కొత్త పాయింట్..సీన్..డైలాగ్ ఒక్కటీ లేదు. జివి ప్రకాష్ కుమార్ సంగీతం ఓకె గా వుంది తప్ప అదీ అట్రాక్టివ్ గా లేదు.

కేవలం లారెన్స్ తో వున్న స్నేహంతో టాగోర్ మధు ఈ సినిమాను తెలుగులోకి తెస్తున్నట్లుంది. లేదా సి సెంటర్ ఆడియన్స్ కు ఇలాంటి సినిమాలు అప్పుడప్పుడు అవసరం పడతాయని అనుకుంటున్నట్లుంది.