టాలీవుడ్ లో ప్రస్తుతం మ్యూజిక్ డైరక్టర్ థమన్ హవా నడుస్తోంది. పెద్ద సినిమాలు అన్నీ కోరి థమన్ దగ్గరకు వస్తున్నాయి. చాలా కాలం తరువాత హీరో మహేష్ బాబు సినిమా కూడా థమన్ దగ్గరకే వచ్చింది.
పరుశురామ్ డైరక్షన్ లో సర్కారు వారి పాట కు థమన్ ఇప్పటికే మూడు ట్యూన్ లు అందించినట్లు తెలుస్తోంది. అయితే ఈ మధ్యలో ఓ ఇంట్రస్టింగ్ ఎపిసోడ్ జరిగినట్లు టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
డైరక్టర్ పరుశురామ్ కు మ్యూజిక్ డైరక్టర్ గోపీ సుందర్ అంటే చిన్న ఆసక్తి వుంది. ఎందుకంటే గీతగోవిందం లో మాంచి ట్యూన్ లు ఇచ్చాడు కనుక. మరోపక్కన కరోనా కారణంగా థమన్ చెన్నయ్ వదిలి రావడం లేదు.
ఈ నేఫథ్యంలో గోపీసుందర్ చేత రెండు శాంపిల్ ట్యూన్ లు చేయించి మరీ హీరో మహేష్ దగ్గరకు పరుశురామ్ వెళ్లి, సిట్యువేషన్ అంతా వివరించి, ఈ ట్యూన్ లు వినిపించినట్లు తెలుస్తోంది.
కానీ మహేష్ ఇప్పడు టాలీవుడ్ లో మంచి సౌండింగ్ నాలెడ్జ్ వున్నది థమన్ కే అని, ఈ సినిమా కు థమన్ తోనే వెళ్దామని నిర్మొహమాటంగా వీటో చేసినట్లు తెలుస్తోంది.
దాంతో చేసేది లేక, తాను కొత్తగా కొన్న ఖరీదైన కారులో, ఓ అసిస్టెంట్ డైరక్టర్ ను సాయం తీసుకుని పరుశురామ్ చెన్నయ్ వెళ్లి మూడు ట్యూన్ లు థమన్ చేత చేయించుకు వచ్చినట్లు తెలుస్తోంది. సర్కారు వారి పాట జనవరి నుంచి సెట్ మీదకు వెళ్తుందని వార్తలు వినిపిస్తున్నాయి.