ప్రభాస్ హీరోగా ఆదిపురుష్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు ఓం రౌత్. ఈ సినిమాతో దర్శకుడిగా టాలీవుడ్ లో అడుగుపెడుతున్న ఈ డైరక్టర్, ఇకపై తెలుగులో కూడా సినిమాలు తీస్తానంటున్నాడు.
“ఆదిపురుష్ తో తెలుగులో ఎంట్రీ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. ఎక్కువమందికి కంటెంట్ చేరువైతే ఏ మేకర్ కైనా ఆనందమే. నాకు అలాంటి అవకాశం వచ్చింది. టాలీవుడ్ లో ఇది నా ఆరంభం మాత్రమే. హిందీలో ఎలాగైతే సినిమాలు చేస్తున్నానో, ఇకపై తెలుగులో కూడా సినిమాలు చేస్తాను. ఆదిపురుష్ తర్వాత టాలీవుడ్ నుంచి మరిన్ని ఆఫర్లు వస్తాయని అనుకుంటున్నాను.”
రెండు భాషల్లో సినిమా తీయడం తనకు ఇబ్బంది అనిపించలేదని, పైపెచ్చు బాగా ఎంజాయ్ చేశానని చెబుతున్నాడు రౌత్. ఇక ఆదిపురుష్ విషయానికొస్తే, రామాయణం ఇతివృత్తంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కేవలం సినిమాటిక్ లిబర్టీ మాత్రమే తీసుకున్నానని, అంతకుమించి ఎలాంటి మార్పులు చేయలేదంటున్నాడు
“ఆదిపురుష్ కోసం నేను సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నాను. అంటే దానర్థం నేను ఇతిహాసాన్ని మార్చేశానని కాదు. అలా మారిస్తే అది సినిమాటిక్ లిబర్టీ అనిపించుకోదు. ఆల్రెడీ ఉన్నదాన్ని ఎంత అందంగా వర్ణించాం అనేదే నా దృష్టిలో సినిమాటిక్ లిబర్టీ. పురాణాల్ని మార్చడం తప్పు, దాన్ని కొత్తగా, అందంగా చూపించడంలో తప్పులేదు. చాలామంది సినిమాటిక్ లిబర్టీ పేరిట చరిత్రను మార్చేస్తున్నారు. అది తప్పు.”
ఆదిపురుష్ లో రాముడిగా కనిపించబోతున్నాడు ప్రభాస్. రావణాసురుడిగా సైఫ్ అలీఖాన్ నటించాడు. ప్రస్తుతం ఈ సినిమాకు గ్రాఫిక్స్ వర్క్ జరుగుతోంది.