పెద్దోళ్ల సాయం అందని పిల్లలు!

అహింస..దర్శకుడు తేజ సినిమా. హీరో దగ్గుబాటి అభిరామ్..సినిమా అలా పక్కన వుంది. ఎప్పటికో బయటకు రావచ్చు.రాకపోవచ్చు. నిజానికి అభిరామ్ తండ్రి సురేష్ బాబు తలుచుకుంటే టక్కున పని జరిగిపోతుంది. కానీ తలుచుకోరు. రూపాయి లాభం…

అహింస..దర్శకుడు తేజ సినిమా. హీరో దగ్గుబాటి అభిరామ్..సినిమా అలా పక్కన వుంది. ఎప్పటికో బయటకు రావచ్చు.రాకపోవచ్చు. నిజానికి అభిరామ్ తండ్రి సురేష్ బాబు తలుచుకుంటే టక్కున పని జరిగిపోతుంది. కానీ తలుచుకోరు. రూపాయి లాభం రాకున్నా, రూపాయి నష్టం వస్తుందనుకున్నా దాని జోలికి పోరు. అది కొడుకు సినిమా అయినా అంతే. అందుకే కావచ్చు అహింస అలా వుండిపోయింది.

మెగాస్టార్ చిరు తనయ. తను ఇప్పటికి ఒకటి రెండు ఓటిటి కంటెంట్ లు, సినిమాలు చేసారు. కానీ పెద్దగా గుర్తింపు లేదు. ఆడిందీ లేదు. పేరు తెచ్చుకున్నదీ లేదు. నిజానికి మెగాస్టార్ తలుచుకుంటే ఓ భారీ ప్రాజెక్ట్ సెట్ చేయడం క్షణంలో పని. తొమ్మండుగురు మెగా హీరోలు వున్నారు. ఏదో ప్రాజెక్ట్ తో పెద్ద నిర్మాతగా మారొచ్చు. కానీ ఎందుకో ఆ సాయం మాత్రం చేయరు.

అల్లు శిరీష్. అరవింద్ గారి అబ్బాయి. అంత వరకే. ఆయన తలచుకుంటే ఏడాదికో సరైన సినిమా వంతున తీసి ఈ పాటికి ఓ లెవెల్ లో నిలబెట్టగలిగి వుండేవారు. కానీ అప్పుడు అప్పుడు ఏదో తీసాం అనేలా ఓ చిన్న సినిమా తీసి వదుల్తారు. వాటికి పెద్దగా గుర్తింపు రాదు. శిరీష్ అలా వుండిపోయాడు.

మంచు మనోజ్. తండ్రి మోహన్ బాబు తలుచుకుంటే ఈ పాటికి రెండు మూడు సినిమాలు వచ్చి వుండేవి. కానీ ఎందుకో అలా జరగలేదు. ప్రారంభమైన సినిమా కాస్తా ఆగిపోయి వుంది.

దిల్ రాజు యువ వారసులు. హన్సిక..హర్షిత్..చిన్న చిన్న సినిమాలకే పరిమితం. సరైన పెద్ద ప్రాజెక్ట్ పడితే వాళ్ల పేర్లు కూడా అందరికీ గట్టిగా పరిచయం అవుతాయి. కానీ ఆ టైమ్ ఎప్పుడో తెలియదు.

ఇంకా చాలా మంది ఇండస్ట్రీ వారసులు వున్నారు. తండ్రులు మంచి పొజిషన్ లో సరైన సాయం అందని వారు. అంటే మరి ఎవరి కాళ్ల మీద వాళ్లే ఎదగాలనే సూత్రమో, లేక మన డబ్బులు ఎందుకు దండగ పెట్టడం అనే ఆలోచనో మరి.