నినాదాలను రైజ్ చేయడంలో భారతీయ జనతా పార్టీ క్రియేటివిటికి తిరుగులేదు. నరేంద్రమోడీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించే సమయంలో నమో.. నమః అంటూ మోడీ పేరును షార్ట్ గా కొత్త నినాదంగా మార్చినా. అబ్కీ బార్ మోడీ సర్కార్ .. అంటూ ప్రచారం చేసినా.. ఈ తరహా క్యాచీ ప్రొపగండా విషయంలో కమలం పార్టీ చాలా ప్రావీణ్యాన్నే ప్రదర్శిస్తోంది.
ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్రమోడీ మరో నినాదాన్ని ఇచ్చారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో , ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పేరును కొత్త నినాదంగా మార్చారు. ఉత్తరప్రదేశ్ షార్ట్ ఫామ్ యూ,పీ అనే అక్షరాలను, యోగి పేరుతో కలుపుతూ.. యూ, పీ + యోగి.. ఉప్ యోగి అంటూ మోడీ కొత్త నినాదాన్ని ఇచ్చారు. ఇది ఎన్నికల నినాదం అని వేరే చెప్పనక్కర్లేదు.
UP+ Yogi=Upyogi అంటూ మరో ఎన్నికల నినాదంతో వచ్చింది బీజేపీ. యూపీకి యోగి చాలా ఉపయోగం అనే రీతిలో ఎన్నికల ప్రచారాన్ని చేస్తోంది. ఇప్పటికే యూపీ ఎన్నికల విషయంలో ఆరేడు నెలలుగా బీజేపీ చాలా కసరత్తు చేస్తూ ఉంది. కేంద్రంలో తమ ఆధిపత్యానికి యూపీనే ప్రధానమైన పిల్లర్ వారికి వేరే చెప్పనక్కర్లేదు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలైనా, బోటాబోటీగా నెగ్గినా.. కేంద్రంలోని మోడీ సర్కారుపై గట్టి వ్యతిరేకత మొదలైందనే సంకేతాలు దేశమంతటికీ అందుతాయి. యోగి కన్నా.. మోడీకే యూపీ ఎన్నికలు చాలా కీలకం ఒక రకంగా.
ఈ పరిస్థితుల్లో.. యోగితో యూపీకి ఉపయోగం అంటూ, ఉప్ యోగ్ అంటూ మోడీ నినాదాన్ని ఇచ్చారు. ఈ మాటలు మ్యాజిక్, పదాల అల్లిక బాగానే ఉంది కానీ.. మరి ప్రజలా మొగ్గు ఎలా ఉంటుందో! సర్వేలేమో.. బీజేపీకి వంద సీట్లు తగ్గుతాయంటున్నాయి. ఆ మేరకు ఎస్పీకి ఉపయోగం అంటున్నాయి. అయితే భారీ వేవ్ అధికారంలోకి వచ్చిన వారు, గెలిస్తే అదే స్థాయి గెలుస్తారు, లేదంటే ఓడిపోతారు తప్ప.. బోటాబోటీ మెజారిటీలతో నెగ్గే సంప్రదాయం ఉండదనేది రాజకీయ విశ్లేషకుల మాట.