పుష్ప ఫ‌స్ట్ డ్రాఫ్ట్.. వెబ్ సీరిస్ గా!

త‌న పుష్ప క‌థ పుట్టుపూర్వోత్త‌రాల‌ను ఒక్కొక్క‌టిగా చెబుతున్నాడు ద‌ర్శ‌కుడు సుకుమార్. ఈ క్ర‌మంలో పుష్ప క‌థ‌ను ముందుగా త‌ను వెబ్ సీరిస్ కోసం అనుకున్న‌ట్టుగా ఈ ద‌ర్శ‌కుడు చెప్ప‌డం గ‌మ‌నార్హం. ఫ‌స్ట్ పార్టే  లెంగ్తీ…

త‌న పుష్ప క‌థ పుట్టుపూర్వోత్త‌రాల‌ను ఒక్కొక్క‌టిగా చెబుతున్నాడు ద‌ర్శ‌కుడు సుకుమార్. ఈ క్ర‌మంలో పుష్ప క‌థ‌ను ముందుగా త‌ను వెబ్ సీరిస్ కోసం అనుకున్న‌ట్టుగా ఈ ద‌ర్శ‌కుడు చెప్ప‌డం గ‌మ‌నార్హం. ఫ‌స్ట్ పార్టే  లెంగ్తీ అనిపించుకుంటూ, రెండో పార్ట్ లో కూడా రాబోతోంది పుష్ప‌. ఈ క్ర‌మంలో ఈ లెంగ్తీ క‌థ కు అస‌లు మూలం వెబ్ సీరిస్ వ‌ద్ద ఉన్న‌ట్టుగా ద‌ర్శ‌కుడే స్వ‌యంగా చెప్ప‌డం గ‌మ‌నార్హం.

ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో వెబ్ సీరిస్.. ఈ ఐడియా సూప‌ర్ గా ఉంది. ఈ నేప‌థ్యంలో ఒక ముఠాధిప‌తి రైజ్ అండ్ ఫాల్ లేదా.. కేవ‌లం రైజ్ ను వెబ్ సీరిస్ గా ప్రెజెంట్ చేస్తే అది సూప‌ర్ గా ఉండ‌వ‌చ్చు. అమెరికన్ వెబ్ సీరిస్ లు ప్ర‌ధానంగా బ్యాంకు దోపిడీ ముఠాలు, డ్ర‌గ్స్ ముఠాల చుట్టూ తిరుగుతుంటే, దాన్ని లోక‌లైజ్ చేయ‌డానికి ఎర్ర‌చంద‌నం స్మ‌గ్గింగ్ వ్య‌వ‌హారం సూప‌ర్ గా ఉండ‌వ‌చ్చు.

మ‌రి వెబ్ సీరిస్ ల వ‌ర‌కూ ఇంట్ర‌స్టింగ్ గా ఉండే పాయింట్ ను సినిమాగా మార్చార‌ట‌.  దీంతో అనుకున్న లెంగ్త్ మొత్తం సినిమాగా ప్ర‌జెంట్ చేసి ఉండ‌వ‌చ్చు. దీంతోనే ఈ సినిమా రెండు పార్టులు మారింద‌ని సుకుమార్ మాట‌ల‌ను బ‌ట్టి స్ప‌ష్టం అవుతోంది. 

ఈ వెబ్ సీరిస్ రేంజ్ కాన్సెప్ట్ ను సినిమాగా మ‌ల్చిన‌ట్టుగా ద‌ర్శకుడే చెప్ప‌డంతో .. ఈ సినిమా పట్ల వ‌స్తున్న మిశ్ర‌మ‌స్పంద‌న  న్యాయ‌మే అనిపిస్తుంది.