మీడియా మీట్ కు కూడా పాస్ లు వేసేయాలి. పంచేయాలి. స్పాన్సర్లను మెప్పించాలి. అని ఎవరు అనుకున్నారో కానీ మహానుభావులు. మొత్తం మీద ఆర్ఆర్ఆర్ మీడియా మీట్ కే ఎసరు వచ్చింది.
ఈవెంట్ ఆర్గనైజేషన్ సంస్థ విచ్చలవిడిగా పాస్ లు ముద్రించి ఫ్యాన్స్ కు పంచేయడంతో పివిఆర్ థియేటర్ దగ్గరకు ఎన్టీఆర్, చరణ్ ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలో వచ్చేసారు. జై ఎన్టీఆర్, జై చరణ్ నినాదాలతో మారుమోగించేసారు.
అసలు మీడియా జనాలు వెళ్లడానికి అవకాశం కోసం చాలా కష్టపడాల్సి వచ్చింది. ఇలాంటి నేపథ్యంలో దర్శకుడు రాజమౌళి వచ్చి క్షమాపణ చెప్పి, మీడియా మీట్ ను క్యాన్సిల్ చేసి వెళ్లిపోయారు. ఈ పాపం మాది కాదంటే మాది కాదంటూ ఎవరికి వారు తప్పించుకుంటున్నారు.
అసలు మీడియా మీట్ కు ఈవెంట్ మేనేజ్ మెంట్ కంపెనీ ఎందుకు? అసలు ఆ కంపెనీ పాస్ లు ఎందుకు ముద్రించాల్సి వచ్చింది అన్నదానికి సమాధానం లేదు. మీడియా మీట్ కు పీఆర్వో చాలు ఈవెంట్ మేనేజ్ మెంట్ కంపెనీతో పనేంటీ? అన్నది అనుమానం.
అసలు ఇదంతా రాజమౌళికి తెలిసే జరిగిందా? మొత్తం మీద ట్రయిలర్ ఇంత సక్సెస్ అయిందని యూనిట్ పడుతున్న ఆనందం మొత్తం ఈవెంట్ కంపెనీ చేసిన పనితో పక్కకుపోయింది.