మమ్మల్ని ఆదుకోండి దేవరకొండ!

తన సినిమా హిట్ అయిందని భావించి అభిమానులకు కోటి రూపాయలు సహాయం చేస్తారంటూ ప్రకటించిన ఖుషి సినిమా హీరో విజయ్ దేవరకొండకు ప్రముఖ నిర్మాణ, డిస్ట్రిబ్యూటర్ సంస్థ అయిన అభిషేక్ పిక్చర్స్ గట్టి షాక్…

తన సినిమా హిట్ అయిందని భావించి అభిమానులకు కోటి రూపాయలు సహాయం చేస్తారంటూ ప్రకటించిన ఖుషి సినిమా హీరో విజయ్ దేవరకొండకు ప్రముఖ నిర్మాణ, డిస్ట్రిబ్యూటర్ సంస్థ అయిన అభిషేక్ పిక్చర్స్ గట్టి షాక్ ఇచ్చింది.

గ‌తంలో విజయ్ నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా డిస్ట్రిబ్యూషన్‌లో 8 కోట్లు కోల్పోయామని దానిపై ఇప్ప‌టి వ‌ర‌కు ఎవరు స్పందించలేదని.. కానీ ఇప్పుడు మీరు పెద్ద మనసుతో అభిమానులకు కోటి రూపాయలు విరాళం ఇస్తున్నందుకు ధన్యవాదాలు అంటూనే.. దయచేసి మమ్మల్ని మా డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల కుటుంబాలను కూడా కాపాడాలని కోరుతూ & ఆశిస్తున్నాము అంటూ.. #మానవత్వం #ప్రేమ #తాదాత్మ్యం హ్య‌ష్ ట్యాగ్ పెడుతూ విజ‌య్ ట్వీట్ట‌ర్‌ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు.

ప్ర‌స్తుతం విజ‌య్ సినిమా హిట్ అయింద‌ని రాష్ట్రంలోని ఆల‌య‌ల ప‌ర్య‌ట‌న చేస్తున్నారు. కాగా 2020లో విజయ్ నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడిన విషయం అందరికీ తెలిసిందే. తాజా అభిషేక్ పిక్చర్స్ ట్వీట్ పై విజయ్ ఎలా స్పందిస్తారో చూడాలి. గ‌తంలోనే  'లైగర్' సినిమా డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు కూడా త‌మ‌కు న్యాయం చేయలంటూ పెద్ద ఎత్తున్న రోజుల పాటు ధ‌ర్నాలు చేసిన విష‌యం తెలిసిందే.