సైలెంట్ గా పెళ్లి చేసుకోనున్న 49 ఏళ్ల హీరో?

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోష‌న్ పెళ్లి కి రెడీ అవుతున్న‌ట్టుగా ఉంది. ఈ 49 ఏళ్ల హీరో కొన్నేళ్ల కింద‌ట త‌న భార్య సుసాన్ తో విడాకులు తీసుకున్నాడు. ఇద్ద‌రు పిల్లలు క‌లిగిన…

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోష‌న్ పెళ్లి కి రెడీ అవుతున్న‌ట్టుగా ఉంది. ఈ 49 ఏళ్ల హీరో కొన్నేళ్ల కింద‌ట త‌న భార్య సుసాన్ తో విడాకులు తీసుకున్నాడు. ఇద్ద‌రు పిల్లలు క‌లిగిన త‌ర్వాత‌, ఈ జంట విడిపోయింది. చిన్న‌నాటి నుంచి ఒక‌రికి ఒక‌రు తెలిసి, ప్రేమించుకుని పెళ్లి చేసుకుని, చాలా సంవ‌త్స‌రాల పాటు సాఫీగా దాంప‌త్యాన్ని కొన‌సాగించిన వీరు ఎందుకో విడిపోయారు.

అయితే ఆ త‌ర్వాత వీరిద్ద‌రూ ప‌లు సార్లు క‌లిసి క‌నిపించారు. త‌మ పిల్ల‌ల‌తో క‌లిసి వెకేష‌న్ల‌కు వెళ్లారు. అలా దంప‌తులుగా విడిపోయినా, త‌ల్లిదండ్రులుగా వీరు విడిపోలేదు. అడ‌పాద‌డ‌పా క‌లిసి క‌నిపిస్తూ మ‌ళ్లీ క‌లిసిపోతారేమో అనేంత హైప్ ను కూడా క్రియేట్ చేశారు. అయితే.. అలాంటిదేమీ జ‌ర‌గ‌లేదు. అంత‌లో హృతిక్ మాజీ భార్య కూడా మ‌రో రిలేష‌న్ షిప్ ను మొద‌లుపెట్టిన‌ట్టుగా వార్త‌లు వ‌చ్చాయి.

మ‌రోవైపు హృతిక్ కూడా సబా అజాద్ తో కలిసి క‌నిపించ‌సాగాడు. వారిద్ద‌రూ ప్రేమ‌లో ఉన్న‌ట్టుగా కొన్నాళ్ల నుంచి ప్ర‌చారం జ‌రుగుతూ ఉంది. ఈ నేప‌థ్యంలో వారిద్ద‌రూ పెళ్లి కూడా చేసుకోబోతున్న‌ట్టుగా ఇప్పుడు రూమ‌ర్లు వినిపిస్తున్నాయి. పెద్ద హ‌డావుడి లేకుండా సైలెంట్ వీరు పెళ్లి చేసేసుకోబోతున్న‌ట్టుగా స‌మాచారం. ఈ పెళ్లికి హృతిక్ పిల్ల‌లు కూడా ఆమోదం తెలిపార‌ట‌! దీంతో లేటు వ‌య‌సులో హృతిక్ మరోసారి పెళ్లి కొడుకు కావ‌డ‌మే త‌రువాయ‌ని తెలుస్తోంది.