షాపింగ్ మాల్ ట్రయల్‌రూం. ఉన్నట్టుండి ఓ యువతి కెవ్వుమని కేకలేసింది. దీంతో షాపింగ్ మాల్‌కు వచ్చిన కస్టమర్లతో పాటు అక్కడ పనిచేసే సిబ్బంది…అసలేం జరిగిందో అర్థంకాక భయంతో వణికిపోయారు. కేకలు వేయడానికి కారణాలపై ఆ యువతిని సిబ్బంది ఆరా తీశారు. పైనున్న సెల్ కెమెరాను చూపించిందా యువతి.
హైదరాబాద్‌లోని జూబ్లీ హిల్స్‌లోని ఓ షాపింగ్ మాల్ ట్రయల్‌రూంలో యువతి దుస్తులు మార్చుకుంటుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు యువకులు వీడియో తీస్తుండడాన్ని పసిగట్టిన సదరు యువతి భయంతో కేకలేసింది.
ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు పెరిగాయి. యువతి ఫిర్యాదుతో షాపింగ్‌మాల్ సిబ్బంది డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఆ వీడియోను యువతితో తొలగింపజేశారు. వీడియో తీసిన మొబైల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఘటనలో ఇద్దరు యువకులతో పాటు స్టోర్ మేనేజర్ ఆమన్‌పై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఇలా గత కొంత కాలంగా ఆ యువకులు తమ సెల్‌ఫోన్‌లో మహిళల నగ్న దృశ్యాలను చిత్రీకరించినట్టు పోలీసులు గుర్తించారు.
అయితే ఈ దృశ్యాలను ఆర్థికంగా సొమ్ము చేసుకునేందుకు ఎక్కడైనా చిత్రీకరించారా లేదా ఇంటర్‌నెట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్నారా అనేది విచారణలో తేలాల్సి వుంది. ఇలా గుర్తించలేనివి ఎన్నో జరుగుతున్నాయనే చర్చకు తెరలేచింది.