నాడు గంజాయి గర్వం..మరి నేడు… ?

గంజాయ్…అదే పొలిటికల్ గా ప్రత్యర్ధులకు ఆయుధంగా మారుతోంది. గంజాయి అన్నది ఈ రోజు ఉందా. లేక ఇపుడే పుట్టిందా. శతాబ్దాల క్రితమే అది ఉంది. పురాణాల్లోనూ ఆ ప్రసక్తి ఉంది. మరి ఇపుడే ఈ…

గంజాయ్…అదే పొలిటికల్ గా ప్రత్యర్ధులకు ఆయుధంగా మారుతోంది. గంజాయి అన్నది ఈ రోజు ఉందా. లేక ఇపుడే పుట్టిందా. శతాబ్దాల క్రితమే అది ఉంది. పురాణాల్లోనూ ఆ ప్రసక్తి ఉంది. మరి ఇపుడే ఈ రోజే కొత్తగా కనుగొన్నట్లుగా ఈ రంకెలు ఏంటి, ఢిల్లీ వీధుల్లో ఈ గర్జనలు ఏంటి. 

ఏపీని మొత్తం గంజాయి వనంగా మార్చే కుత్సిత ప్రయత్నాలు ఏంటి. మొత్తానికి మొత్తం అయిదు కోట్ల మంది జనాభా గంజాయి బానిసలే అని చిత్రీకరించే బురదజల్లుడేంటి. అసలు ఇంతకీ గంజాయి కధా కమామీషూ ఏంటి. అదే ఇపుడు రాజకీయ పనిముట్టు ఎందుకు అయింది.

అంటే బురద జల్లడానికి బాగా పనికివస్తుది. మత్తుగా, గమ్మత్తుగా గంజాయి ఉంటుంది. అదే తమాషా మరి. విశాఖ జిల్లాలోని ఏజెన్సీలో గంజాయి మొత్తం చుట్టుకుని ఉందని అంటున్నారు. అది నిజమే. గంజాయి విశాఖ ఏజెన్సీలో పెద్ద ఎత్తున సాగు అవుతోంది. అది నిన్నా నేడూ కాదు, కాలాలకు అతీతంగా అలా సాగిపోతోంది.

చంద్రబాబు సీఎం గా ఉండగానే కేజీల నుంచి టన్నుల లెక్కన గంజాయి రవాణా సాగిపోయిందని సాక్షాత్తూ ఆయన క్యాబినేట్ మంత్రి గంటా శ్రీనివాసరావు 2017లో విశాఖలో ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. అంతే కాదు, దేశంలో ఏ మూలకు గంజాయి వెళ్లాలన్నా విశాఖ నుంచే రవాణా అని కూడా చెప్పేశారు. దీని మీద క్యాబినేట్లో తాను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చానని, ఆయన మన వైజాగ్ సిటీ గంజాయి విషయంలో నంబర్ వన్ గా ఉందా అంటూ సరదాగా నవ్వేశారని కూడా చెప్పుకున్నారు.

దీనికి అరికట్టడానికి కృషి చేస్తున్నామని కూడా గంటా అన్నారు. మొత్తానికి ఇది చిన్న వ్యవహారం కాదని, చాలా మంది పెద్దలు వెనకాల ఉన్నారని కూడా నాటి మంత్రి గంటా అనుమానం వ్యక్తం చేశారు. మొత్తానికి గంజాయి కధ చంద్రబాబు హయాంలోనే చాలా పెద్ద ఎత్తున ఉందని గంటా చెప్పాక‌ లోకం తాజాగా మరోమారు విన్నది. 

ఇదిపుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మరి ఇంతకీ గంటా అన్న మాటలను బట్టి చూస్తే చంద్రబాబుకు నాడే గంజాయి సాగు సంగతి తెలుసు. మరి నాడు దాన్ని అరికట్టడానికి ఏం చేశారు, నాడు కనుక గట్టిగా చర్యలు తీసుకుని ఉంటే నేడు రాష్ట్రపతిని కలసి వినతులు చేయాల్సిన అవసరం ఉండదు కదా అన్నది మేధావుల మాట. 

దీని మీద వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ గంటా నాటి మాటల సాక్షిగా బాబు సంగతి తెలిసిందని, ఇపుడేమంటారని ప్రశ్నించారు. మొత్తానికి గంజాయి గురించి ఇపుడే కొత్తగా వింటున్నట్లుగా తమ్ముళ్ళు నానాయాగీ చేయడమే తెలుగు రాజకీయాల్లో సరికొత్త అంకంగా చెప్పాలేమో.