మరోసారి కెలుక్కుంటారా.. వెనక్కి తగ్గుతారా?

తొలిగించిన సన్నివేశాలతోనే స్ట్రీమింగ్ పెడతారా.. లేక ఒరిజినల్ వెర్షన్ నే ఓటీటీలో పెడతారా అనేది ఇప్పుడు అందరి అనుమానం.

ఎంపురాన్ (లూసిఫర్ 2) రన్ దాదాపు ముగిసింది. వసూళ్లు కొల్లగొట్టడంతో పాటు వివాదాలు కూడా సృష్టించింది ఈ సినిమా. వచ్చే గురువారం నుంచి ఇది స్ట్రీమింగ్ కు రాబోతోంది.

ఏ సినిమా అయినా స్ట్రీమింగ్ కు రావడం సహజం. కానీ ఎంపురాన్ విషయంలో అది సహజం కాదు. దీని చుట్టూ చాలా వివాదాలున్నాయి. రిలీజైన తర్వాత ఈ సినిమా నుంచి చాలా సన్నివేశాలు తొలిగించారు.

అలా తొలిగించిన సన్నివేశాలతోనే స్ట్రీమింగ్ పెడతారా.. లేక ఒరిజినల్ వెర్షన్ నే ఓటీటీలో పెడతారా అనేది ఇప్పుడు అందరి అనుమానం.

ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు అత్యంత వివాదాస్పదమయ్యాయి. మరీ ముఖ్యంగా మహిళలపై చూపించిన కొన్ని హింసాత్మక దృశ్యాలపై తీవ్ర అభ్యంతరాలొచ్చాయి. వాటన్నింటినీ సినిమా నుంచి తొలిగించారు. ఓటీటీ వెర్షన్ లో కూడా ఎడిట్ అయిన వెర్షన్ నే స్ట్రీమ్ చేసే అవకాశం ఉంది.

ఇప్పటికే ఈ సినిమా మేకర్స్ కొన్ని ఇబ్బందులు పడ్డారు. నిర్మాత, హీరోపై ఆదాయపు పన్ను శాఖ దాడులు కూడా జరిగాయి. అటు కేరళలో ఇది రాజకీయ వివాదానికి కూడా దారితీసింది. ఇలాంటి సమయంలో మరోసారి వివాదాలు రేకెత్తించేలా వ్యవహరించాలనుకోవడం లేదు మేకర్స్.

జియో హాట్ స్టార్ నుంచి వచ్చిన తాజా సమాచారం ప్రకారం.. ఎవ్వరికీ ఎలాంటి అభ్యంతరాల్లేని ఎంపురాన్ వెర్షన్ నే ఓటీటీలో స్ట్రీమింగ్ కు తీసుకురాబోతున్నారు. అన్-కట్ వెర్షన్, సెన్సార్ వెర్షన్ అంటూ కొత్తగా ఎలాంటి జోడింపులు ఉండవని అంటున్నారు