ప్రపంచంలో ఖరీదైన వాచీ.. రేటు ఎంతో తెలుసా?

ప్రస్తుతం మార్కెట్లోకి చాలా రకాల వాచీలు వస్తున్నాయి. రెగ్యులర్ వాచీల్ని వదిలేసి స్మార్ట్ వాచెస్ వైపు పరుగులు పెడుతున్నారంతా. ఈ సంగతి పక్కనపెడితే, ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వాచీ ఏది? దాని రేటు ఎంత?…

ప్రస్తుతం మార్కెట్లోకి చాలా రకాల వాచీలు వస్తున్నాయి. రెగ్యులర్ వాచీల్ని వదిలేసి స్మార్ట్ వాచెస్ వైపు పరుగులు పెడుతున్నారంతా. ఈ సంగతి పక్కనపెడితే, ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వాచీ ఏది? దాని రేటు ఎంత? అలాంటి వాచీ ఒకటి ఉంది. దాని రేటు తెలిస్తే నిజంగానే 'వాచి'పోతుంది.

ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత ఖరీదైన వాచ్.. గ్రాఫ్ డైమండ్స్ హాలూసినేషన్. ఈ గడియారాన్ని చాలా అరుదైన రంగుల వజ్రాలతో (110 క్యారెట్లు) తయారు చేశారు. అయితే ఇది పురుషుల్ని దృష్టిలో పెట్టుకొని చేసింది కాదు. స్త్రీల కోసం ప్రత్యేకతంగా చేసింది. ఈ వాచ్ ఖరీదు అక్షరాలా 55 మిలియన్ డాలర్లు. అంటే ఇండియన్ కరెన్సీలో దీని విలువ 451 కోట్ల రూపాయలు.

అయితే ఈ వాచ్ ను తయారుచేసింది అమ్మడం కోసం కాదు. ది గ్రాఫ్ సంస్థ తన కంపెనీ గొప్పదనాన్ని చాటిచెప్పేందుకు ఈ అత్యంత ఖరీదైన, అరుదైన వాచీని తయారుచేసింది. ప్రస్తుతానికి ప్రపంచంలో ఇంతకంటే కాస్ట్ లీ వాచీ మరొకటి లేదు.

ప్రపంచవ్యాప్తంగా దొరికే రంగరంగుల వజ్రాల్ని సేకరించి, వాటిని వివిధ ఆకృతుల్లో కట్ చేసి, ప్లాటినంపై పొదిగి ఈ వాచీని తయారుచేశారు. దీన్ని తయారుచేయడానికి వేల గంటల సమయాన్ని వెచ్చించింది సదరు కంపెనీ.

అయితే ఇంతకుముందే చెప్పుకున్నట్టు ఈ వాచీ అమ్మకానికి కాదు. మరి ప్రపంచంలో ఇప్పటివరకు అమ్ముడుపోయిన అత్యంత ఖరీదైన వాచీ ఏది? దీనికి సమాధానంగా నిలుస్తోంది, ఫిలిప్ గ్రాండ్‌మాస్టర్ చైమ్ 6300A-010. ఈ వాచీని ప్రత్యేకంగా జెనీవాలోని క్రిస్టీస్‌లో వేలం వేశారు. అప్పుడిది 31.19 మిలియన్ డాలర్లకు కు అమ్ముడుపోయింది.