మాజీ మంత్రి కొల్లు రవీంద్ర హత్యానేరంపైన అరెస్ట్ అయ్యారు. ఆయన రాజమండ్రీ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. సరే అచ్చెన్నాయుడు అరెస్ట్ తో మొదలైన కధ ఇపుడు కొల్లు దాకా వచ్చింది.
మరి బీసీ నేతలను అరెస్ట్ చేస్తున్నారంటూ గుండెలు బాదుకునే తెలుగుదేశం పార్టీ పెద్దలు కొల్లు రవీంద్రను మాత్రం పరామర్శించేందుకు రాకపోవడం చర్చగా ఉందంటున్నారు. ఆయనను పరామర్శించేందుకు విశాఖ టీడీపీ అర్బన్ జిల్లా ప్రెసిడెంట్ వాసుపల్లి గణేష్ కుమార్ ని చంద్రబాబు పంపారట.
అధినాయకత్వం ఆదేశాలతో తాను కొల్లు కుటుంబాన్ని పరామర్శించినట్లుగా వాసుపల్లి చెబుతున్నారు. ఇంతవరకూ బాగానే ఉన్నా జేసీల, అచ్చెన్నల ఇళ్ళకు వెళ్ళి మరీ పరామర్శించిన లోకేష్ కొల్లు ఇంటికి ఎందుకు వెళ్ళలేదన్నదే ఇక్కడ ప్రశ్న.
అదే టైంలో ఎక్కడో విశాఖలో ఉన్న ఎమ్మెల్యేను విజయవాడ పంపించడం ఏంటో అర్ధం కావడం లేదని బీసీ తమ్ముళ్ళు అంటున్నారు. అంటే మనిషి మనిషికీ ఒక న్యాయం, జిల్లాకు జిల్లాకు ఓ ధర్మం అన్నదే బాబు ఫిలాసఫీ కాబోలు.
ఇక బీసీలందు టీడీపీ బీసీలు వేరయా. అందునా బాబు మెచ్చే పరమ బీసీలు వేరయా అన్నట్లుగా పచ్చ పార్టీ థియరీ ఉందని అంటున్నారు. ఇన్ని రకాల సామాజిక రాజకీయ విభజనలూ చేస్తున్న టీడీపీ తాను మాత్రమే అచ్చమైన బీసీ బంధువునని చెప్పుకోవడమే అసలైన విడ్డూరం మరి.