ముచ్చ‌ట‌గా నాలుగో సీఎస్‌

జ‌గ‌న్ రెండున్న‌రేళ్ల పాల‌న పూర్త‌య్యే స‌రికి ముచ్చ‌ట‌గా నాలుగో ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రానున్నారు. జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే …అప్ప‌టికే ఆ ప‌ద‌విలో ఉన్న ఎల్వీ సుబ్ర‌మ‌ణ్యాన్ని కొన‌సాగించారు. ఏం జ‌రిగిందో తెలియ‌దు…

జ‌గ‌న్ రెండున్న‌రేళ్ల పాల‌న పూర్త‌య్యే స‌రికి ముచ్చ‌ట‌గా నాలుగో ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రానున్నారు. జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే …అప్ప‌టికే ఆ ప‌ద‌విలో ఉన్న ఎల్వీ సుబ్ర‌మ‌ణ్యాన్ని కొన‌సాగించారు. ఏం జ‌రిగిందో తెలియ‌దు కానీ, ఆయ‌న్ను ఆక‌స్మికంగా బ‌దిలీ చేశారు. 

ఎల్వీ స్థానంలో నీలం సాహ్నీ వ‌చ్చారు. ఆమె ప‌ద‌వీ కాలాన్ని ఏడాది పాటు కొన‌సాగించారు. అనంత‌రం సీఎస్‌గా ఆదిత్య‌నాథ్ దాస్‌ను నియ‌మించారు. సీఎస్ ఆదిత్య‌నాథ్ దాస్ ప‌ద‌వీ కాలం ఈ నెల‌తో 30తో ముగియ‌నుంది. ఆయ‌న ప‌ద‌వీ కాలాన్ని పొడిగిస్తారా?  లేదా? అనే అంశానికి నేటితో తెర‌ప‌డింది. 

కొత్త సీఎస్‌గా  సమీర్‌ శర్మను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. అక్టోబ‌ర్ 1న ఆయ‌న ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్నారు. ఈయ‌న 1985 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి.  ప్రస్తుతం ఆయన రాష్ట్ర ప్రణాళిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ లీడర్‌షిప్‌ గవర్నెన్స్‌ సంస్థ (ఐఎల్ఈజీ) వైస్‌ ఛైర్మన్, సభ్య కార్యదర్శిగా కొన‌సాగుతున్నారు.

సమీర్‌ శర్మ కొనేళ్లుగా కేంద్ర సర్వీసుల్లో ఉన్నారు. సమీర్ శర్మ సైతం మరో రెండు నెలల్లో అంటే నవంబరు నెలాఖరులో పదవీ విరమణ చేయాల్సి ఉంది. అయితే ప‌ద‌వీ కాలం పొడిగింపు హామీతో ఆయ‌న రాష్ట్రానికి వ‌స్తున్నార‌ని చెబుతున్నారు.