నో న్యూ డైరక్టర్ ప్లీజ్-చైతన్య

హీరో నాగార్జున ప్రయోగాలు చేసాడు తన కెరీర్ స్టార్టింగ్ లో. కొత్త కొత్త డైరక్టర్లతో చేసాడు. కానీ దానికి రివర్స్ లో వెళ్తున్నాడు హీరో నాగ్ చైతన్య.  Advertisement కొత్త డైరక్టర్లకు అవకాశం ఇచ్చి…

హీరో నాగార్జున ప్రయోగాలు చేసాడు తన కెరీర్ స్టార్టింగ్ లో. కొత్త కొత్త డైరక్టర్లతో చేసాడు. కానీ దానికి రివర్స్ లో వెళ్తున్నాడు హీరో నాగ్ చైతన్య. 

కొత్త డైరక్టర్లకు అవకాశం ఇచ్చి ఇచ్చి, ఫ్లాపులు, యావరేజ్ లు చూసి చూసి, ఇక కొత్తవాళ్లతో సినిమా చేయకూడదని డిసైడ్ అయిపోయాడట. 

కావాలంటే రెండు మూడు హిట్ లు ఇచ్చి, ఓ ప్లాపు ఇచ్చిన డైరక్టర్ అయినా ఓకె కానీ, కొత్త డైరక్టర్ అయితే సినిమా చేసేది లేదని చైతన్య క్లారిటీగా నిర్మాతలకు చెప్పేస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం దిల్ రాజకు థాంక్యూ చేస్తున్నారు. అమీర్ ఖాన్ హిందీ సినిమాకు 40 రోజుల డేట్ లు ఇచ్చేసారు. ఆ తరువాత డేట్ ల కోసం చాలా మంది నిర్మాతలు ట్రయ్ చేస్తున్నారు. నిర్మాతలు సాహు, నాగవంశీ తదితరులు లైన్ లో వున్నారు. దిల్ రాజు కూడా మరో సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

ఇలాంటి సినిమాలో అందరికీ చైతూ ఇస్తున్న క్లారిటీ ఒకటేనట. కొత్త డైరక్టర్లు వద్దు. కథ బాగున్నా, కరెక్ట్ గా హ్యాండిల్ చేయగల అనుభవం వున్నవారినే చూసుకోండి అని చెప్తున్నాడట. ఫెయిల్యూర్స్ నుంచి పాఠాలు బాగానే నేర్చుకున్నట్లున్నాడు.