ఈ మధ్య కొత్త కొత్త డైరక్టర్లు కొత్త కొత్త పాయింట్లతో వస్తున్నారు. జనాలను ఒప్పిస్తున్నారు. కొన్నింటికి జనాలు నో అంటున్నారు. ఉప్పెనలో ఓ కొత్త పాయింట్ ను టచ్ చేసారు.
సినిమాకు ముందే ఈ 'కటింగ్' పాయింట్ అన్నది బయటకు వచ్చింది. జనాలను ప్రిపేర్ చేసింది. జనాలు యాక్సెప్ట్ చేసారు కూడా.
చావు కబురు చల్లగా సినిమాలో కూడా ఓ విభిన్నమైన పాయింట్ ను టచ్ చేసారు. తల్లి కొడుకు కలిసి మందు కొట్టడం, తల్లికి వేరే అతనితో సంబంధం వుండడం లాంటి ఆడ్ పాయింట్లను జనం యాక్సెప్ట్ చేయలేకపోయారు. చేసి వుంటే అది కూడా ఓ రేంజ్ సినిమా అయి వుండేది.
శేఖర్ కమ్ముల-నాగ్ చైతన్య-సాయిపల్లవి ల కాంబినేషన్ లో రాబోతున్న లవ్ స్టోరీ సినిమాలో కూడా ఇలా ఓ ఆడ్ పాయింట్ వుందని టాక్ వినిపిస్తోంది. దీనిని కూడా జనాలు ఎలా తీసుకుంటారో చూడాల్సి వుందని ఇండస్ట్రీ లో టాక్ వినిపిస్తోంది.
చాలా కాలంగా బర్నింగ్ టాపిక్ గా వున్న ఓ పాయింట్ ను శేఖర్ కమ్ముల సినిమాలో టచ్ చేసినట్లు తెలుస్తోంది.