పాతికేళ్ళైనా జనం క్షమించరట!

పాపాలు చేస్తే క్షమాపణలు గురించి మాట్లాడుకోవాలి. కొన్ని రకాల పాపాలకు క్షమాపణలు కూడా ఉండవు. అలాంటివే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు చేసినా పాపాలు అంటున్నారు వైసీపీ ఎమ్మెల్యే పెట్ల…

పాపాలు చేస్తే క్షమాపణలు గురించి మాట్లాడుకోవాలి. కొన్ని రకాల పాపాలకు క్షమాపణలు కూడా ఉండవు. అలాంటివే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు చేసినా పాపాలు అంటున్నారు వైసీపీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్

ఈ ఇద్దరు నాయకులతో పాటు ట్విట్టర్ పిట్ట లోకేష్ ని కూడా ఏపీ జనం ఇప్పట్లో క్షమించే అవకాశాలు బొత్తిగా లేవని వైసీపీ ఎమ్మెల్యే తేల్చేశారు. ఎందుకంటే వారు చేస్తున్న రాజకీయాలు అలాంటివి అని మండిపడుతున్నారు.

విశాఖలో మత్తు డాక్టర్ సుధాకర్ని అడ్డుపెట్టుకుని చంద్రబాబు, అయ్యన్న  నడిపిన డ్రామాను చూసి ఏపీ జనం ఏవగించుకుంటున్నారని కూడా అంటున్నారు. టీడీపీ అఫీసులోనే స్క్రిప్ట్ రెడీ చేసి మరీ మత్తు డాక్టర్ ని విశాఖ రోడ్ల మీదకు తెచ్చారని పెట్ల ఆరోపిస్తున్నారు.

మరుసటి రోజు ఘటనకు ముందు రోజు ప్రెస్ నోట్ తయారు చేయడం ఎక్కడైనా ఉంటుందా, అది ఒక్క పచ్చ పార్టీకే సాధ్యమని కూడా ఆయన ఆగ్రహించారు. ఏపీలో సజావుగా పాలన సాగుతూంటే చూసి ఓర్వలేక ఇలాంటి నీతిమాలిన రాజకీయాలు చేస్తున్నారని కూడా విరుచుకుపడ్డారు.

2019 ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని చెప్పి మోసగించిన అయ్యన్న, బాబు, ఇపుడు 2024 ఎన్నికల్లో టికెట్ అంటూ డాక్టర్ని వాడుకోవడం దారుణమని అంటున్నారు. టీడీపీ పెద్దలు చేసిన తప్పులను జనం ఎప్పటికీ క్షమించర‌ని, పాతికేళ్ళు అయినా గుర్తుంచుకుంటారని కూడా శాపాలు పెట్టారు. మొత్తానికి దళిత కార్డుతో వైసీపీని టార్గెట్ చేయాలని  చూసిన టీడీపీ గుట్టు రట్టు చేసిన పెట్ల ఇకనైనా ఈ కుత్సిత రాజకీయాలు మానుకోవాలని అంటున్నారు. కానీ అది జరిగే పనేనా.

తెలంగాణా ప్రయోజనాల కోసం ఎంతవరకైనా వెళ్తాం