ఏపీ బీజేపీ నేతలు.. ఈ కేటాయింపులతో బలపడతారా?

రాజధానికి రూపాయి కూడా విదిల్చింది లేదు. వెనుకబడిన జిల్లాలకు అంటూ గతంలో కేటాయించిన నిధులను ఈ సారి మాటమాత్రమైన ప్రస్తావించలేదు! ఇదీ కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ పరిస్థితి. కేంద్రం నుంచి ఏపీకి వరదలా…

రాజధానికి రూపాయి కూడా విదిల్చింది లేదు. వెనుకబడిన జిల్లాలకు అంటూ గతంలో కేటాయించిన నిధులను ఈ సారి మాటమాత్రమైన ప్రస్తావించలేదు! ఇదీ కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ పరిస్థితి. కేంద్రం నుంచి ఏపీకి వరదలా సాయం రావడం సంగతి అలా ఉంచితే, కనీస కేటాయింపులు కూడా జరగలేదు. ఒకవైపు నిర్మలా సీతారామన్ తెలుగింటి కోడలు, ఏపీ కోడలు అంటూ.. మీడియా హడావుడి చేస్తూ ఉంది. ఇలా హడావుడి చేసే వాళ్లకు ఏ మాత్రం ఇంగితం లేనట్టే.

ఏపీకి కేంద్ర బడ్జెట్ లో అన్యాయం జరిగితే.. ఆమె తెలుగింటి కోడలు అంటూ వీళ్లంతా గర్వపడిపోవడం ఏమిటో మరి! ఒకవైపు మోడీ సర్కారు దక్షిణాది నుంచి దోచి ఉత్తరాదికి పెడుతోందనే విమర్శకు కూడా పదును పెరుగుతూ ఉంది. యూపీ నుంచి వస్తున్న పన్ను వసూళ్లకు రెట్టింపు స్థాయిలో ఆ రాష్ట్రానికి కేటాయింపులు ఉన్నాయని, అదే దక్షిణాది రాష్ట్రాల నుంచి కేంద్రం తీసుకుంటున్న పన్నుల్లో అరవై ఐదుశాతం మాత్రమే తిరిగి ఆ రాష్ట్రాలకు వస్తోందని విశ్లేషకులు అంటున్నారు.

దేశంలో పన్నులు ప్రధానంగా వస్తున్నది దక్షిణాది నుంచి, మహారాష్ట్ర నుంచినే అని.. ఆ రాష్ట్రాలకు కేంద్రం తిరిగి కేటాయించే నిధుల వంతు తక్కువగా ఉందని, అదే ఉత్తరాదికి మాత్రం వడ్డించి వార్చుతున్నారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇది దేశానికి అంత శ్రేయస్కరమైన పద్ధతికాదని మాత్రం చెప్పవచ్చు.

మరోవైపు ఏపీ బీజేపీ నేతల మాటలు కోటలు దాటుతున్నాయి. కనీసం డిపాజిట్లు కూడా సంపాదించుకోలేని వీళ్లు ఆఖరికి అందరినీ హెచ్చరించి, బెదిరించే స్థాయికి వెళ్లిపోయారు. ఏదో రాష్ట్రాన్ని ఉద్ధరిస్తూ ఉన్నట్టుగా అథారిటీ చెలాయించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కేటాయింపులకు వాళ్లు సిగ్గుపడాలి.

ముద్దు ముద్దు మాటలతో దొరసాని.. ఏమి చెప్పిందంటే