అయ్యో…స్టేట్ గవర్న్ మెంట్

ఆంధ్ర ప్రభుత్వ ఉద్యోగుల నిట్టూర్పు మరింత పెరిగేలా వుంది. ఎందుకంటే వారికి ప్రభుత్వం బకాయి పడిన డిఎల నెంబర్ మరోటి పెరిగింది.  Advertisement ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు కొత్తగా ఓ డిఎ…

ఆంధ్ర ప్రభుత్వ ఉద్యోగుల నిట్టూర్పు మరింత పెరిగేలా వుంది. ఎందుకంటే వారికి ప్రభుత్వం బకాయి పడిన డిఎల నెంబర్ మరోటి పెరిగింది. 

ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు కొత్తగా ఓ డిఎ ను ప్రకటించింది. సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఒకటి రెండు డిఎ లు వెనుక బడి వుంటాయి.

అయినా కూడా కేంద్రం డిఎ ప్రకటించిన కొన్నాళ్లకు రాష్ట్రం ప్రకటిస్తూ వుంటుంది. ఆ ఒకటి రెండు బకాయిలు అన్న తేడా అలా కంటిన్యూ అవుతూ వుంటుంది. 

కానీ ఇప్పుడు ఆంధ్రలో పరిస్థితి అలా లేదు. ప్రభుత్వ ఉద్యోగులకు డిఎ బకాయిలు అనేవి పెరగడం తప్ప తరగడం కనిపించడం లేదు.

ఇలాంటి టైమ్ లో కేంద్రం ఠంచనుగా డిఎ ప్రకటించింది. కానీ రాష్ట్రం ప్రకటిస్తుందా అన్నది అనుమానమే. ఎందుకంటే ఇప్పటికే ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా వుందని వార్తలు గుప్పుమంటున్నాయి. 

జీతాలు, పింఛన్లు చెల్లించడానికే ప్రతినెలా కిందా మీదా అవుతున్నారని తెగ వార్తలు వస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో మళ్లీ మరో డిఎ కేంద్రం ఇచ్చింది. కానీ పాపం, స్టేట్ గవర్న్ మెంట్ ఉద్యోగులు ఆశగా ఎదురు చూడడం తప్ప చేయగలిగింది లేదు.