కామెడీ.. పవన్ కూడా వార్నింగ్ ఇస్తున్నాడు

కేఏ పాల్ మాట్లాడితే అందులో కంటెంట్ కంటే కామెడీనే ఎక్కువగా చూస్తారు జనం. అలాగే ఏ బీఎస్పీ కార్తకర్తనో లేక మరే ఇతర గల్లీ లీడరో మాట్లాడిన ఆ మాటలకు అంతగా ప్రాధాన్యం ఇవ్వాల్సిన…

కేఏ పాల్ మాట్లాడితే అందులో కంటెంట్ కంటే కామెడీనే ఎక్కువగా చూస్తారు జనం. అలాగే ఏ బీఎస్పీ కార్తకర్తనో లేక మరే ఇతర గల్లీ లీడరో మాట్లాడిన ఆ మాటలకు అంతగా ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడీ లిస్టులోకి తనకుతానుగా చేరిపోయారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఈయన మాట్లాడిన మాటలకు కూడా అంతగా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదనే విషయం మొన్న జరిగిన ఎన్నికలతో స్పష్టమైంది. అయినా పవన్ మాత్రం తన కామెడీ ఆపట్లేదు.

ప్రభుత్వాన్ని ప్రశ్నించే స్థాయిలో తను, తన పార్టీ లేదనే విషయం తెలిసి కూడా పవన్ మాట్లాడుతున్నారు. కేవలం మాట్లాడ్డమే కాదు, ఆ మాటలు కోటలు దాటుతున్నాయి కూడా. అవును.. ప్రభుత్వానికి వంద రోజులు గడువు ఇస్తారట జనసేనాని. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే అప్పుడు మాట్లాడతారట. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారట. ఇదీ పవన్ తాజా కామెడీ.

పవన్ ప్రశ్నిస్తానని చెబుతుంటేనే ప్రజలు నవ్వుతున్నారు. అసలు ప్రశ్నించే అర్హత పవన్ కు ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలని సూచిస్తున్నారు. ఎందుకంటే, ఇదే పవన్ గతంలో టీడీపీ సర్కార్ కు కూడా ఇలానే అల్టిమేటం ఇచ్చారు. దగ్గరుండి చంద్రబాబును సీఎం కుర్చీలో కూర్చోబెట్టిన జనసేనాని, ఆ తర్వాత మౌనముని అవతారం ఎత్తారు. టీడీపీ సర్కార్ కు కాస్త గడువిచ్చి చూద్దామంటూ అప్పట్లో కూడా ఇలానే ప్రకటించిన పవన్, ఏకంగా నాలుగేళ్లు చూసీచూడనట్టు ఊరుకున్నారు.

ఇష్టారాజ్యంగా అవినీతి జరుగుతున్నా, మహిళలపై చింతమనేని లాంటి నేతలు దాడులు చేస్తున్నా, కాల్ మనీ సెక్స్ రాకెట్ బయటకొచ్చినా, రాజధాని భూముల పేరిట అడ్డగోలుగా దోపిడీ జరుగుతున్నప్పటికీ.. బాబు జమానాలో మూడున్నరేళ్లు పవన్ అస్సలు స్పందించలేదు. పైపెచ్చు చంద్రబాబు తరపున రాజధాని ప్రాంతాల్లో పర్యటించి సమస్య తీవ్రతను తగ్గించే ప్రయత్నం చేశారు అప్పట్లో. అలాంటి వ్యక్తికి ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ ను ప్రశ్నించే హక్కులేదంటున్నారు జనం.

ఇవన్నీ పక్కనపెడితే.. ప్రజాతీర్పు ప్రకారం చిత్తుచిత్తుగా ఓడిపోయిన పవన్ కల్యాణ్ కు ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చేంత స్థాయి లేదనేది ఇక్కడ వాస్తవం. ఓ సామాన్యుడిలా, ఓటరుగా ప్రశ్నించే హక్కు పవన్ కు ఉంది. కానీ వందరోజుల్లో చెప్పిన మార్పులు వచ్చేయాలి, లేదంటే ప్రభుత్వంలో అలజడి సృష్టిస్తాం, రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతామంటూ స్టేట్ మెంట్స్ ఇస్తేనే కేఏ పాల్ కు, పవన్ కు తేడా లేదనిపిస్తుంది. ఇంతకంటే కామెడీ ఉంటుందా అనిపిస్తుంది.

చంద్రబాబు వ్యూహాలే ఇప్పుడు ఆయనకు పాశాలా