మల్లికా షెరావత్. దాదాపు రెండు దశాబ్దాల కిందట దుమారం రేపిన నటీమణి. ఇప్పుడు నునుగు మీసాల కుర్రాళ్లకు మల్లిక పేరు తెలియనంత స్థాయిలో తెరమరుగు అయ్యిందామె. అమెరికాలో సెటిలైనట్టుగా ఉంది. అయితే తన పీక్ స్టేజీ రోజుల గురించి ప్రస్తావిస్తూ వార్తల్లో నిలుస్తోంది ఈ నటీమణి. మర్డర్ సినిమాతో బాలీవుడ్ ను షేక్ చేసి, ఇండియా వ్యాప్తంగా సెన్షేషన్ అయిన మల్లిక అప్పట్లో తనను నిందించిన వారిని కూడా ఇప్పుడు వదలడం లేదు.
ప్రత్యేకించి ప్రేక్షకులను కూడా ఆమె తప్పు పడుతోంది. అప్పట్లో తను హాట్ గా నటిస్తే ఎంతో మంది బుగ్గలు నొక్కుకున్నారని, అయితే ఇప్పుడు మాత్రం అలాంటి హాట్ సీన్లు ఇండియన్ మూవీస్ లో చాలా కామన్ అయిపోయాయని మల్లిక ప్రస్తావిస్తోంది. ఇదైతే నిజమే.
అప్పట్లో మల్లిక ఒక్కరే సంచలనం, ఇప్పుడు ప్రాంతీయ భాషల సినిమాల్లో కూడా అలాంటి సీన్లు రొటీన్ అయ్యాయి. స్విమ్ సూట్లో అందాలను ఆరేయడం అప్పట్లో దుమారం. స్టార్ హీరోయిన్లు అయితే వాటికి దూరందూరం. ఇప్పుడు స్టార్ హీరోయిన్లు కావాలంటే అవన్నీ తప్పనిసరి.
ఇప్పుడు కుటుంబ సమేతంగా ఇష్టపడే హీరోయిన్లు కూడా అప్పట్లో మల్లిక చేసిన దాని కన్నా చాలా చేస్తూ ఉన్నారు. అయితే అప్పట్లో మల్లికకు మాత్రం మోరల్స్ అంటూ నీతులు వల్లెవేశారంతా. ఆమెనో ద్వితీయ శ్రేణిలా చూశారు. ఇప్పుడు అంతా ఆమోదించేశారు.
ఈ విషయంలో మల్లిక ఆవేదన నిజమే కానీ, ఇక తనకు అవకాశాలు తగ్గముఖం పట్టడం గురించి మాత్రం ఆమె రొటీన్ కాజ్ చెబుతోంది. చాలా మంది హీరోలు తనను పడక పంచుకొమ్మన్నారని, తను అందుకు నిరాకరించినందుకే తనకు అవకాశాలు తగ్గిపోయినట్టుగా మల్లిక చెప్పుకొచ్చింది.
తెరపై హాట్ గా నటించే నువ్వు తెర మెనుక తమతో ఎందుకు అలా నటించవన్నారని మల్లిక అంటోంది. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు అలాంటివి చెప్పకపోవడం, అవకాశాలు మందగించాకా మాత్రమే ఇలాంటివి చెప్పడం పట్ల కొన్ని విమర్శలున్నాయి.