వైసీపీ పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు రెడీ అవుతోంది. సాధారణంగా పార్లమెంట్ రైనీ సెషన్ కూల్ గా ఉండాలి. కానీ ఈసారి అలాంటి సూచనలు కనిపించడంలేదు. లోక్ సభలో నాలుగవ పెద్ద పార్టీగా ఉన్న వైసీపీ ఈసారి సరికొత్తగా కనిపించబోతోంది.
కేంద్రం నుంచి చాలా ప్రశ్నలకు సమాధానం రాబట్టాలని చూస్తోంది. పార్లమెంట్ లో ఈసారి అనేక సమస్యలు ప్రస్థావించడానికి కూడా సిద్ధంగా ఉంది. అందులో విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేయడం మీద గట్టిగా నిలదీయాలని నిర్ణయించారు.
ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదు. మేము ప్లాంట్ లాభాల బాటలో నడించేందుకు అవసరమైన సూచనలు ఎన్నో చెప్పాం, వాటిని అమలు చేయకుండా ప్రైవేటీకరణ చేస్తామంటే ఊరుకోమని విజయసాయిరెడ్డి ఖరాఖండీగా చెబుతున్నారు. ఏపీకి బంగారం లాంటి ప్లాంట్ ని కాపాడుకుంటామని మంత్రి అవంతి కూడా చెబుతున్నారు.
ఇంకో వైపు తెలంగాణాతో ఉన్న జల జగడాల మీద కూడా కేంద్రం ప్రేక్షక పాత్ర మీద నిలదీస్తామని అరకు పార్లమెంట్ సభ్యురాలు గొడ్డేటి మాధవి చెబుతున్నారు. అలాగే రెబెల్ ఎంపీ ఇష్యూలో జరుగుతున్న తాత్సార వైఖరి మీద కూడా పార్లమెంట్ ని స్టాల్ చేస్తామని ఇప్పటికే వైసీపీ వెల్లడించింది.
మొత్తానికి రైజ్ చేయడానికి వైసీపీకి చాలా సమస్యలు ఉన్నాయి. దాంతో ఈసారి పార్లమెంట్ లో వైసీపీ విశ్వరూపం చూపిస్తుంది అంటున్నారు.