‘చంద్రబాబు ఆ ఇల్లు ఖాళీ చేయండి!’

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడి కరకట్ట నివాసం గురించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు స్పందిస్తూ ఉన్నారు. అది ముమ్మాటికీ అక్రమ కట్టడమే అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు అంటున్నారు. ఇటీవలే ఆ…

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడి కరకట్ట నివాసం గురించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు స్పందిస్తూ ఉన్నారు. అది ముమ్మాటికీ అక్రమ కట్టడమే అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు అంటున్నారు. ఇటీవలే ఆ నిర్మాణాన్ని తన అధికారిక నివాసంగా గుర్తించి, ప్రభుత్వమే దాన్ని అద్దెకు, మెయింటెయినెన్స్ కు డబ్బులు ఇవ్వాలని చంద్రబాబు నాయుడు సీఎం జగన్ కు లేఖ రాసిన సంగతి తెలిసిందే.

ఆ కరకట్ట కట్టడం గురించి మొదటి నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ధ్వజమెత్తుతూనే ఉంది. నదిని పూడ్చి ఆ నిర్మాణాన్ని చేపట్టారని, దాన్ని కూల్చాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ  డిమాండ్ చేస్తూ వచ్చింది. ఆ పార్టీ అధికారికంలోకి వచ్చాకా చంద్రబాబు నాయుడు దాని క్రమబద్ధీకరణ కోసం లేఖ రాశారు. అయితే దానిపై ఏ మాత్రం సానుకూలంగా స్పందించడం లేదు ప్రభుత్వం.

తాజాగా ఆ అంశం మీద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి స్పందించారు. ''నదులు, ప్రకృతి వనరులు చంద్రబాబుకు సొంత సంపదలా కనిపిస్తాయి. అందుకే కృష్ణానదిని పూడ్చి కట్టిన ఇంట్లో నిస్సిగ్గుగా నివాసం ఉంటున్నారు. ఏమాత్రం సామాజిక బాధ్యత ఉన్నా తక్షణం ఆ ఇంటిని ఖాళీ చేసి ఆక్రమణల తొలగింపునకు సాయపడాలి. పంచభూతాలను చెరబట్టిన నీచపు చరిత్రను మూటకట్టుకున్నారు.'' అంటూ చంద్రబాబు నాయుడి తీరుపై ఆయన ధ్వజమెత్తారు.

మొత్తానికి ఆ ఇల్లు ఖాళీ చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు చంద్రబాబుకు హితబోధ చేస్తూ ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో ప్రభుత్వం నుంచి  కూడా ఆ అంశంలో అలాంటి స్పందనే వ్యక్తం అయ్యే అవకాశాలున్నాయని స్పష్టం అవుతోంది.

ఆత్మవిమర్శ అవసరం.. దిక్కుతోచని స్థితిలోనే ఈ పనులు