గంటా మళ్ళీ డుమ్మా ?

గంటా శ్రీనివాసరావు టీడీపీకి చెందిన ఎమ్మెల్యే. సీనియర్ నేత. మాజీ మంత్రి. దాదాపు తొమ్మిదేళ్ల తరువాత విశాఖ మహా నగర పాలక సంస్థకు ఎన్నికలు జరిగి తాజాగా కొత్త పాలన వర్గం కొలువు తీరింది.…

గంటా శ్రీనివాసరావు టీడీపీకి చెందిన ఎమ్మెల్యే. సీనియర్ నేత. మాజీ మంత్రి. దాదాపు తొమ్మిదేళ్ల తరువాత విశాఖ మహా నగర పాలక సంస్థకు ఎన్నికలు జరిగి తాజాగా కొత్త పాలన వర్గం కొలువు తీరింది.

తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన కార్పొరేటర్లలో పాటు, ఎక్స్ అఫీషియో సభ్యుల హోదాలో ఎమ్మెల్యేలు కూడా వెళ్ళారు. అయితే గెలిచిన నలుగురిలో ఒకరైన విశాఖ సౌత్ టీడీపీ  ఎమ్మెల్యే వాసుపల్లి  గణేష్ కుమార్ వైసీపీ కండువా కప్పుకు సభలో దర్శనం ఇచ్చారు.

మిగిలిన వారిలో గంటా డుమ్మా కొట్టడంతో ఇద్దరంటే ఇద్దరే టీడీపీ ఎమ్మెల్యేలు ఆ పార్టీ తరఫున జీవీఎంసీలో కనిపించారు. ఒక దశలో మేయర్ సీటుకు పోటీ పడతామని తెలుగుదేశం ప్రకటించి కూడా వెనక్కి తగ్గింది.  

మేయర్ సీటు దక్కాలంటే మ్యాజిక్ ఫిగర్ 58 అని తెలిసి కూడా టీడీపీ పోటీకి సై అన్న వేళ ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉన్న గంటా లాంటి వారి ఓటు ఎంతో కీలక‌మే.

ఇవన్నీ తెలిసి కూడా గంటా గైర్ హాజర్ కావడం మరో మారు టీడీపీలో చర్చగా ఉంది. మొత్తానికి టీడీపీలో ఉన్నానని చెబుతున్నా గంటా ఇలా తరచూ డుమ్మా కొట్టడం తమ్ముళ్లకు ఏమీ పాలుపోవడంలేదు అంటున్నారు.

'మోసగాళ్లు' పబ్లిక్ టాక్

'చావు కబురు చల్లగా'పబ్లిక్ టాక్