ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ గా బాబు చేత సెలెక్ట్ చేయబడిన అచ్చెన్నాయుడు తన పనితీరుని రుజువు చేసుకోవాల్సిన చోట చతికిలపడ్డారు. స్థానిక ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఉత్తరాంధ్రాలో దారుణమైన ప్రదర్శన చేసింది. మొత్తానికి మొత్తం సీట్లను వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది.
దాంతో అచ్చెన్నాయుడు ఫస్ట్రేషన్ కి గురి అయ్యారు అని వైసీపీ నేతల నుంచి కామెంట్స్ పడిపోతున్నాయి. లేకపోతే జగన్, విజయసాయిరెడ్డి ఇద్దరూ జైలుకు వెళ్తారంటూ ఢిల్లీలో తెగ ప్రచారం అవుతోందని అచ్చెన్న అనడమేంటి అంటూ కస్సుమంటున్నారు.
చంద్రబాబు మీద సీఐడీ కేసు నమోదు చేసింది. దాని మీద మాట్లాడుతూ తమ అధినాయకుడిని వెనకేసుకువచ్చిన అచ్చెన్నాయుడు మధ్యలో బ్యాలన్స్ తప్పేసి వైసీపీ పెద్దల మీద హాట్ కామెంట్స్ చేశారు.
దీంతో స్థానిక ఎన్నికల్లో ఘోర పరాజయం ప్రభావం నుంచి అచ్చెన్న ఇంకా బయటకు రాలేకపోతున్నారు అని వైసీపీ నేతలు బాగానే సెటైర్లు వేస్తున్నారు.