కార్తికేయ 2కి కీరవాణి సన్

సంగీత దర్శకుడు కీరవాణి కొడుకు కాలభైరవ. గాయకుడిగా ప్రూవ్ చేసుకున్న కాలభైరవ ఇప్పుడు సంగీత దర్శకుడిగా కూడా మారాడు. ఇప్పటికే ఓ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. లేటెస్ట్ గా మరో సినిమాకు కూడా సైన్…

సంగీత దర్శకుడు కీరవాణి కొడుకు కాలభైరవ. గాయకుడిగా ప్రూవ్ చేసుకున్న కాలభైరవ ఇప్పుడు సంగీత దర్శకుడిగా కూడా మారాడు. ఇప్పటికే ఓ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. లేటెస్ట్ గా మరో సినిమాకు కూడా సైన్ చేసాడు. హీరో నిఖిల్ చేసే కార్తికేయ సీక్వెల్ కు కాలభైరవను మ్యూజిక్ డైరక్టర్ గా తీసుకున్నారు.

కాలభైరవ ను మ్యూజిక్ డైరక్టర్ గా తీసుకున్నందుకు బోనస్ గా కీరవాణి ఓ థీమ్ మ్యూజిక్ ను, ఓ సాంగ్ ట్యూన్ ను ఇస్తారట. సిన్మా సబ్జెక్ట్ విని కీరవాణి ఈ మేరకు తానే ముందుకు వచ్చి మాట ఇచ్చారట. బౌండ్ స్క్రిప్ట్ రెడీ అయిన ఈ సినిమాను పీపుల్స్ మీడియా పతాకంపై విశ్వప్రసాద్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

కార్తికేయ 2 రైట్స్ ఒరిజినల్ నిర్మాత దగ్గర వుండిపోవడంతో ఈ సినిమాకు బాహుబలి కంక్లూజన్ మాదిరిగా, కార్తికేయ పక్కన మరోపదం జోడించి టైటిల్ ఫిక్స్ ఛేస్తారని బోగట్టా. నార్త్ ఇండియాలో ఈ సినిమా ఎక్కువభాగం షూటింగ్ జరుపుకుంటుంది.