వర్మ మొదలెట్టారండీ బాబూ

సినిమా తీయడం వరకే వర్మ పని. ఆ తరువాత దాని సంగతి అతగాడికి అవసరం లేదు. భైరవగీత సినిమా ఇంటికెళ్లిపోయింది. అక్కడికి ఆ చాప్టర్ క్లోజ్. ఇప్పుడు లక్ష్మీస్ ఎన్టీఆర్ పని మొదలుపెట్టాడు. ఇలాంటి…

సినిమా తీయడం వరకే వర్మ పని. ఆ తరువాత దాని సంగతి అతగాడికి అవసరం లేదు. భైరవగీత సినిమా ఇంటికెళ్లిపోయింది. అక్కడికి ఆ చాప్టర్ క్లోజ్. ఇప్పుడు లక్ష్మీస్ ఎన్టీఆర్ పని మొదలుపెట్టాడు. ఇలాంటి టైమ్ లో ఎన్టీఆర్ బయోపిక్ ఫంక్షన్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఏకంగా ట్విట్టర్ లో పోల్ నే పెట్టేసాడు. నాదెండ్ల వెన్నుపోటు..బాబు వెన్నుపోటు..ఏది చెత్త లేదా చెడ్డ అన్నట్లుగా. సహజంగానే బాబు వెన్నుపోటుకే ఎక్కువ ఓట్లు పడుతున్నాయి.

ఇది చాలదన్నట్లు, పవన్ కళ్యాణ్ మీదకు తిప్పాడు ట్వీట్ల వ్యవహారాన్ని. దాదాపు అయిదారు ట్వీట్లు వేసాడు. నాదెండ్ల మనోహర్ తో జర జాగ్రత్త అంటూ. తండ్రి ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిస్తే, కొడుకు పవన్ కు వెన్ను పోటు పొడిచే అవకాశం వుందని హెచ్చరించాడు. అంతే కాదు, నాదెండ్ల మనోహర్ ను డైరక్ట్ గా ఈ ట్వీట్లలో టార్గెట్ చేయడం విశేషం.

మొత్తానికి బయోపిక్ ఫంక్షన్ నాటికి వెన్నుపోటు వ్యవహారాన్ని వీలయినంతగా జనాలకు గుర్తుచేయాలని వర్మ కంకణం కట్టుకున్నట్లు కనిపిస్తోంది. అదే సమయంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ లోని కుట్ర..కుట్ర..కుట్ర సాంగ్ ఫస్ట్ లుక్ ను అడియో ఫంక్షన్ టైమ్ కు కాస్త ముందుగా విడుదల చేస్తుండడం విశేషం.

బయోపిక్ ను డైరక్ట్ చేయాలని ఆర్జీవీ తెగ సరదా పడ్డారు. కానీ అది సాధ్యం కాలేదు. అప్పటి నుంచి పాపం, ఆయన ఏదో విధంగా బయోపిక్ ను టార్గెట్ చేస్తూనే వున్నారు.

లగడపాటి సర్వే జనా సుఖినోభవంతు

అన్ని దోశలు ఎలా వేశావ్ భయ్యా.. ఆకలేసి ఫన్నీ వీడియో