ఆమె స్టార్ హీరోయిన్ కాదు. కాకపోతే ఉన్నంతలో అవకాశాలు బాగానే దక్కించుకుంటోంది. అయితే ఆ మాత్రం దానికే ఆమెకు తలపొగరు ఎక్కువైందంటున్నారు కొందరు హీరోలు. తమకు ఏమాత్రం 'సహకారం' అందించడం లేదని నిర్మాతలకు ఫిర్యాదులు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆమెకు చెక్ పెట్టేందుకు హీరోలంతా ఒక్కటయ్యారు. ఆమెను కట్ చేయాలని నిర్ణయించుకున్నారు.
యంగ్ హీరోస్ లో ఓ కోటరీ ఉంది. ఎవరి సినిమాలు వాళ్లు చేసుకుంటున్నప్పటికీ తెరవెనక వాళ్లందరికీ ఓ అండర్ స్టాండింగ్ ఉంటుంది. ఆ కోటరీలో ఒక హీరో సరసన ఛాన్స్ సంపాదిస్తే, ఆటోమేటిగ్గా మరో ఇద్దరు హీరోల సినిమాల్లో హీరోయిన్ ఛాన్సులు పట్టేయొచ్చు. సదరు హీరోయిన్ ఆ హీరోల గ్రూప్ లోకి ఎంటరైంది కానీ, తన 'సహాయ నిరాకరణ'తో మిగతా హీరోలకు దూరం కాబోతోంది.
గతేడాది రెండు మంచి హిట్స్ కొట్టిన ఆ హీరోయిన్, ఈ ఏడాది మాత్రం సరైన సక్సెస్ అందుకోలేకపోయింది. 3 సినిమాలు చేస్తే మూడూ ఫ్లాప్ అయ్యాయి. రీసెంట్ గా ఓ కుర్రహీరో సరసన చేసిన భారీ బడ్జెట్ సినిమా కూడా ఫ్లాప్ అయింది. ఇలాంటి టైమ్ లో ఆమె కీలకమైన హీరోల గ్రూప్ నుంచి బహిష్కరణకు దూరమైంది.
కోటరీ ఎఫెక్ట్ ఆ ముద్దుగుమ్మపై ఇప్పటికే పడింది. వచ్చే ఏడాదికి సంబంధించి ఆమె చేతిలో కేవలం ఒకే ఒక్క సినిమా ఉంది. అది కూడా 'సహాయ నిరాకరణ'కు ముందు ఒప్పుకున్న సినిమా కాబట్టి మిగిలింది. తెలుగులో ఇక ఆమెకు అవకాశాలు కష్టమే. ప్రస్తుతం ఆ హీరోయిన్ తమిళ సినిమాలపై ఫోకస్ పెట్టింది.